Begin typing your search above and press return to search.

మహేష్ రిజెక్ట్ చేశాడు.. విజయ్ ఓకే చెప్పాడు..!

By:  Tupaki Desk   |   22 Sep 2021 1:30 AM GMT
మహేష్ రిజెక్ట్ చేశాడు.. విజయ్ ఓకే చెప్పాడు..!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు - డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వచ్చిన 'మహర్షి' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడమే కాకుండా ఎన్నో అవార్డులు గెలుపొందింది. ఈ సినిమా తర్వాత వెంటనే మహేష్ - వంశీ కలిసి మరో ప్రాజెక్ట్ చేయాలని అనుకున్నారు. అయితే వంశీ పైడిపల్లి తన కథతో మహేష్ ని మెప్పించలేకపోయారు. ఈ క్రమంలో దర్శకుడు స్క్రిప్టులో పలు మార్పులు చేసి హీరోని ఒప్పించే ప్రయత్నం చేశారు. దీని కోసం వంశీ చాలా ఎక్కువ సమయమే కేటాయించారు కానీ.. ఈ ప్రాజెక్ట్ మాత్రం సెట్ అవలేదు.

ఈ నేపథ్యంలో మహేష్ 'సరిలేరు నీకెవ్వరు' చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లారు.. పరశురామ్ చెప్పిన 'సర్కారు వారి పాట' కథను ఓకే చేశారు. కాకపోతే వంశీకి ఫ్యూచర్ లో మళ్ళీ కలసి వర్క్ చేద్దామనే మాటైతే ఇచ్చారు. దీంతో సూపర్ హిట్ సినిమా తీసినా కూడా పైడిపల్లికి చాలా గ్యాప్ వచ్చే పరిస్థితి ఏర్పడింది. అయితే ఇన్నాళ్లకు వంశీ తదుపరి ప్రాజెక్ట్ మీద క్లారిటీ వచ్చింది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో దర్శకుడు ఓ మల్టీ లాంగ్వేజ్ సినిమా చేయబోతున్నారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. దీని కోసం విజయ్ కు భారీ రెమ్యూనరేషన్ ముట్టజెప్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఉంటుందని వంశీ మొన్న సైమా వేడుకలప్పుడు వెల్లడించారు. 'బీస్ట్' సినిమా కంప్లీట్ అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే అప్పుడు మహేష్ రిజెక్ట్ చేసిన కథతోనే పైడిపల్లి.. విజయ్ తో చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

మహేష్ బాబు నో చెప్పిన కథను విజయ్ కు వినిపించిన వంశీ పైడిపల్లి.. ఎలాంటి మార్పులు సూచించకుండా హీరో సైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నారట. నిజానికి వంశీ చెప్పిన స్టోరీ బాగున్నప్పటికీ.. ఆల్రెడీ చేసిన జోనర్ లోనే ఉండటంతో మహేష్ తిరస్కరించారట. విజయ్ కు ఇది కొత్తగా అనిపించడంతో వెంటనే ఓకే చేశారు. మహేష్ నటించిన ఎన్నో సూపర్ హిట్ కథలను రీమేక్ చేసిన విజయ్.. ఈసారి మహేష్ రిజెక్ట్ చేసిన కథతో సినిమా చేయడానికి రెడీ అయ్యారన్నమాట. మరి ఈ సినిమా విజయ్ - వంశీ పైడిపల్లి లకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.