విజయ్ సమంత యాక్సిడెంట్.. అసలు నిజం ఇదే!

Tue May 24 2022 10:44:52 GMT+0530 (IST)

Vijay Samantha Accident This is the real truth

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత కలయికలో వస్తున్న ఖుషి సినిమా షూటింగ్ ఇటీవల మొదలైన విషయం తెలిసిందే. విభిన్నమైన దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ సోషల్ మీడియాలో మంచి హైప్ ఐతే క్రియేట్ చేసింది. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని కూడా ఆడియెన్స్ నమ్మకంతో ఉన్నారు.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కేవలం తెలుగులోనే కాకుండా.. తమిళం కన్నడ మలయాళ భాషల్లో కూడా సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయాలని అనుకుంటున్నారు. అయితే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఇటీవల కాశ్మీర్లో మొదలవగా చాలా వేగంగా ఆ పనులన్నీ పూర్తిచేసుకున్నారు. అయితే సినిమా షూటింగ్ సమయంలో ఒక ప్రమాదం జరిగింది అని ఆ ప్రమాదంలో సమంత విజయ్ దేవరకొండ గాయపడినట్లుగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి.

ఇది ఎంత వరకు నిజం అనే విషయంలో అభిమానులు కూడా కాస్త కన్ఫ్యూజన్ కు గురయ్యారు. ఇక వెంటనే ఆ విషయంలో చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇచ్చేశారు. షూటింగ్ నిర్వహిస్తుండగా ప్రమాదం జరిగింది అని ఆ ప్రమాదంలో సమంత విజయ్ దేవరకొండ ఇద్దరు కూడా గాయపడినట్లు వార్తలు వచ్చాయని అయితే అందులో ఎలాంటి నిజం లేదని చిత్ర యూనిట్ నుంచి అఫీషియల్ గా మీడియాకు వివరణ ఇచ్చింది. అయితే దర్శకుడు శివ నిర్వాణ కూడా సోషల్ మీడియాలో ముందుగానే క్లారిటీ ఇచ్చారు ఇదంతా ఫేక్ న్యూస్ అంటూ ఆయన కొట్టిపారేశారు.

సాధారణంగా దర్శకుడు శివ నిర్మాణం తప్పుడు వార్తలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటాడు. తన సినిమాలకు సంబంధించి ఇలాంటి తప్పుడు వార్తలు ప్రేక్షకుల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయ కూడదు అని ఆలోచిస్తూ ఉంటాడు.

ఇక ఖుషి సినిమ మొదటి షెడ్యూల్ లో కాశ్మీర్ లోని కొన్ని అందమైన ప్రదేశాల్లో షూటింగ్  చేయడం జరిగింది. చాలా వేగంగా ముగిసిన ఈ షెడ్యూల్తో చిత్రం యూనిట్ చాలా సంతోషంగా ఫీల్ అయింది. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.