Begin typing your search above and press return to search.

ఈ సూపర్‌ స్టార్‌ స్పీడ్‌ ను మెచ్చుకోవాల్సిందే

By:  Tupaki Desk   |   24 Jan 2020 1:30 AM GMT
ఈ సూపర్‌ స్టార్‌ స్పీడ్‌ ను మెచ్చుకోవాల్సిందే
X
తెలుగు స్టార్‌ హీరోలు సంవత్సరానికి ఒక సినిమాను విడుదల చేయడమే చాలా గొప్ప విషయంగా ఉంది. కొందరు హీరోలు అయితే రెండేళ్లకు ఒక్కటి అన్నట్లుగా సినిమాలు చేస్తున్నారు. కాని సినిమాల స్పీడ్‌ విషయంలో తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌ మాత్రం జెట్‌ స్పీడ్‌ తో దూసుకు పోతున్నాడు. ఈయన సంవత్సరంలో కనీసం రెండు సినిమాలైన విడుదల అయ్యేలా ప్లాన్‌ చేసుకుంటూ వెళ్తున్నాడు. టాలీవుడ్‌ ఎంత ప్రయత్నించినా కూడా సంవత్సరంలో రెండు సినిమాలు రావడం లేదు. కాని ఈయన మాత్రం ఈజీగా రెండేసి సినిమాలు చొప్పున విడుదల చేస్తూ వస్తున్నాడు.

ఇటీవలే విజిల్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్‌ ఆ సినిమా విడుదల అవ్వడమే ఆలస్యం వెంటనే లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్‌ చాలా స్పీడ్‌ గా చిత్రీకరణ జరుగుతుంది. ఆ చిత్రం షూటింగ్‌ ముగింపు దశకు చేరుకున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇదే సమయంలో విజయ్‌ అప్పుడే తన కొత్త సినిమాకు ఓకే చెప్పినట్లుగా సమాచారం అందుతోంది.

గత ఏడాది జయం రవి మరియు రాశిఖన్నా నటించిన అంగడ మారు అనే చిత్రంకు దర్శకత్వం వహించిన కార్తీక్‌ తంగవేల్‌ సక్సెస్‌ దక్కించుకున్నాడు. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కమర్షియల్‌ గా కూడా మంచి వసూళ్లను రాబట్టింది. ఆ సినిమాతో విజయ్‌ దృష్టిని కార్తిక్‌ ఆకర్షించాడు. ఇటీవలే విజయ్‌ కి దర్శకుడు కార్తిక్‌ తంగవేల్‌ చెప్పిన స్టోరీ నచ్చడంతో ఆయన దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది.

ఈ ఏడాది సమ్మర్‌ లోనే వీరి కాంబో మూవీ పట్టాలెక్కి ఇదే ఏడాది చివర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఈ చిత్రంకు సంబంధించిన విశేషాలను అతి త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నారు అంటూ తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మొత్తానికి విజయ్ స్పీడ్ ఇతర హీరోలకు ఆదర్శం కావాలంటూ ఆయన అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేసున్నారు.