ఆ హీరో షర్టు విప్పి తిరుగుతోంది అందుకేనా?

Thu Jul 12 2018 16:01:52 GMT+0530 (IST)

Vijay Deverakonda go shirtless for ROWDY CLUB

ఒంటిపై షర్టు లేకుండానే బైకెక్కి నడిరోడ్లపై తిరుగుతున్నాడు. అదే అవతారంలో బస్టాప్ లో నిలుచుకొని దర్శనమిస్తున్నాడు. ఇదంతా ఓ హీరో చేస్తున్నాడంటే ఆశ్చర్యం కలగకమానదు. ఆ హీరో ఎవరో కాదు.. విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డితో యమా క్రేజ్ సంపాదించిన ఆయన ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ జోరుమీదున్నాడు.  ట్విట్టర్ లో తన ఫ్యాన్స్ ని మై  డియర్ రౌడీస్ అని సంబోధిస్తూ హల్ చల్ చేస్తుంటాడు విజయ్.  అయితే ఇటీవల ఆయన షర్టు లేకుండా తీయించుకొన్న ఫొటోల్ని కూడా ట్విట్టర్ లో పెడుతూ నెటిజన్లలో ఆసక్తిని రేకెత్తించారు. నాకు తగిన షర్ట్ దొరకలేదని ఆ ఫొటో కింద కామెంట్ పెడుతున్నారు.స్టైల్ కోసమే చేస్తున్నాడేమో అని కొందరు - ఎంత స్టైల్ అయితే మాత్రం ఒంటిపై షర్ట్ లేకుండా బజార్లలో కనిపించడమేంటని మరికొందరు మాట్లాడుకొన్నారు. అయితే అదంతా కూడా విజయ్ తన వ్యాపారం కోసమే చేస్తున్నాడట. రౌడీ పేరుతో సొంత దుస్తుల బ్రాండ్ ని ప్రారంభించబోతున్నాడట. దాని ప్రచారం కోసమే ఆయన ఇదంతా చేస్తున్నాడట. ఈ నెల 15నే ఆయన బ్రాండ్ ఓపెన్ అవుతోందని సమాచారం. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ కూడా ఇదే తరహాలో బీయింగ్ హ్యూమన్ పేరుతో సొంత దుస్తుల బ్రాండ్ ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మరి విజయ్ కూడా బీయింగ్ హ్యూమన్ రేంజ్ లో తన బ్రాండ్ ని విస్తరిస్తాడేమో చూడాలి. త్వరలోనే ఆయన `గీత గోవిందం`తో సందడి చేయబోతున్నాడు. ఆ తర్వాత టాక్సీవాలా విడుదవుతుంది.