ఇదేనా విజయ్ దేవరకొండ రియల్ స్టామినా?

Sun Feb 16 2020 13:01:21 GMT+0530 (IST)

Vijay Deverakonda Real Stamina Proved with World Famous Lover Movie

ఒక స్టార్ హీరోకు సాధారణ హీరోకు తేడా ఏంటంటే ఓపెనింగ్ కలెక్షన్స్.  సాధారణ హీరో సినిమాకు సూపర్ హిట్ టాక్ వస్తే తప్ప కలెక్షన్స్ రావు.  ఎంత హిట్ అయినా ఒక 100 కోట్ల కలెక్షన్స్ మార్క్ చేరలేరు. అదే స్టార్ హీరో సినిమాలకు టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ కలెక్షన్స్ దుమ్ములేపుతాయి. ఎంత ఫ్లాప్ సినిమా అయినా ఓపెనింగ్స్ భారీగా ఉంటాయి.  కనీసం మొదటి ఐదు రోజులు డీసెంట్ కలెక్షన్స్ వస్తాయి. హిట్ టాక్ వస్తే కలెక్షన్స్ సునామి వస్తుంది.  యువ హీరో విజయ్ దేవరకొండను ఎక్కువమంది స్టార్ హీరో అంటున్నారు కానీ విజయ్ సినిమాల కలెక్షన్స్ మాత్రం ఆ స్థాయిలో లేనే లేవు.విజయ్ తాజా చిత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్' ఈ శుక్రవారమే రిలీజ్ అయింది. తొలిరోజు వసూళ్లు నిరాశజనకంగా ఉన్నాయి.  విజయ్ గత చిత్రం 'డియర్ కామ్రేడ్' కంటే దాదాపు ముప్పై శాతం కలెక్షన్స్ తగ్గడం గమనార్హం. ఈ సినిమా పాతిక కోట్లకు పైచిలుకు థియేట్రికల్ రైట్స్ బిజినెస్ జరిగిందని అంటున్నారు. అయితే మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు కోట్ల రూపాయల షేర్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సినిమాకు మిశ్రమస్పందన దక్కడంతో రెండో రోజు కలెక్షన్స్ మరింతగా డ్రాప్ అయ్యాయని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.

విజయ్ స్టార్ హీరో అనే హడావుడి సోషల్ మీడియాలో కనిపిస్తోంది కానీ గ్రౌండ్ రిపోర్ట్ మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా ఉందనే వాదన వినిపిస్తోంది.  ఒక స్టార్ హీరో సినిమా అంటే టాక్ తో సంబంధం లేకుండా మినిమమ్ కలెక్షన్స్ సాధించాలి.  ప్రస్తుతం విజయ్ సినిమాల పరిస్థితి చూస్తున్నవారు మాత్రం ఇంకా రౌడీకి ఆ స్థాయి రాలేదని అంటున్నారు.  మరి నెక్ట్స్ సినిమాతో అయినా విజయ్ ఈ వాదను తప్పు అనే ప్రూవ్ చేస్తాడా అనేది వేచి చూడాలి.