రౌడీ ఫ్యాన్స్ పై లాఠీల జులుం!

Wed Jul 17 2019 19:50:40 GMT+0530 (IST)

Vijay Deverakonda On Track To Be Pan-South Star!

రౌడీ ఫ్యాన్సా మజాకానా?  ఆ సందర్భంలో అసలు అర్థం కానంతగా కన్ఫ్యూజ్ చేసేశారు. అసలేం జరుగుతోంది? అంటూ దేవరకొండ సైతం కంగారు పడిపోయాడంటే... ఎంత రచ్చ చేశారో అర్థం చేసుకోవాలి. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ రచ్చ ఏ రేంజులో ఉందో ఇదిగో ఈ వీడియోలు చూస్తేనే అర్థమైపోతుంది.`డియర్ కామ్రేడ్` మ్యూజికల్ ఫెస్టివల్ పేరుతో ఇటీవల ప్రచారంలో హీట్ పెంచేసిన దేవరకొండ ప్రస్తుతం బెంగళూరు.. కొచ్చి.. చెన్నయ్.. హైదరాబాద్ అంటూ చుట్టేస్తున్నాడు. ప్రతిచోటా లైవ్ ఈవెంట్లతో అభిమానుల్ని కలుస్తున్నాడు. ఇలా కలిసేందుకు వెళ్లినచోట జరిగిన రచ్చ మామూలుగా లేదు. ఓ వెన్యూ వద్దకు ఊకవేస్తే రాలనంత మంది అభిమానులు వచ్చారు. అసలు ఆ ఈవెంట్ నిర్వాహకులు ఆ ఫ్లోటింగ్ ని అస్సలు ఊహించలేదు. ఆర్జనైజర్స్ అసలు ఆ వేదిక వద్ద సరైన వసతుల్ని కూడా ఏర్పాటు చేయకపోవడంతో ఫ్యాన్స్ వేదిక వద్దకు దూసుకొచ్చారు. ఆ క్రమంలోనే బోలెడంత గందరగోళం నెలకొందట. దీంతో ఏకంగా పోలీసులు రంగ ప్రవేశం చేసి లాఠీ చార్జ్ చేయాల్సొచ్చింది. ఈ లాఠీ ఛార్జ్ లో ఓ యంగ్ లేడీ ఫ్యాన్ తీవ్రంగా గాయపడింది. ఆమె ముఖంపై ఎర్రగా బొబ్బలు తేలిపోయి కనిపించింది. అయితే ఆ ఫ్యాన్ వద్దకు వచ్చి ఓదారుస్తూ దేవరకొండ సైతం చాలానే కంగారు పడినట్టు ఆ సన్నివేశం చెబుతోంది. ప్రస్తుతం ఈ వీడియోలు జోరుగా వైరల్ అవుతున్నాయి.

తన ఫ్యాన్ కి ఇలా జరగడంతో ఆగలేకపోయిన విజయ్ ఆ ఈవెంట్ నిర్వాహకుల్ని నిలదీసే ప్రయత్నం చేశారట. గడిచిన ఈవెంట్లు ఇలా షాకివ్వడంతో ప్రస్తుతం జరగనున్న చెన్నయ్.. హైదరాబాద్ ఈవెంట్ల విషయంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని నిర్వాహకులకు సూచించాడట. అభిమానుల్ని నిరాశపరిచేలా లేదా వారి హృదయాలు గాయపడేలా ఏ ఒక్క చర్యా ఉండకూడదని దేవరకొండ సీరియస్ గానే చెప్పాడట. జూలై 18న హైదరాబాద్ లో డియర్ కామ్రేడ్ మ్యూజిక్ సెలబ్రేషన్స్ జరగనున్నాయి. ఆ మరసటి రోజే చెన్నయ్ లోనూ ఈవెంట్ జరగనుంది.