Begin typing your search above and press return to search.

#రౌడీ ఫైట‌ర్ .. తుఫాన్ ముందు ప్ర‌శాంత‌త‌!!

By:  Tupaki Desk   |   25 Jan 2021 3:30 AM GMT
#రౌడీ ఫైట‌ర్ .. తుఫాన్ ముందు ప్ర‌శాంత‌త‌!!
X
బ‌రిలో దిగే ముందు కూల్ గా క‌నిపిస్తున్నాడు. ఇదేదో చూస్తుంటే ఉప్పెన‌కు ముందు సింబాలిజమా? అవును నిజ‌మే.. తుఫాన్ ముందు ప్ర‌శాంత‌త అని చెప్ప‌క‌నే చెబుతోంది రౌడీ ‌కొండ వాలకం.

విజయ్ దేవరకొండ త‌దుప‌రి పూరి ద‌ర్శ‌క‌త్వంలో `లైగర్` చిత్రీకరణను ప్రారంభించడానికి సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిన‌దే. షూటింగ్ లేన‌ప్పుడు అత‌డు ఇదిగో ఇలా త‌న పెంపుడు శున‌కం తో ఆట‌లాడుతూ రిలాక్స్ అవుతున్నాడు.

ఈ హార్ట్ ఫుల్ మూడ్ .. రిలాక్స్ డ్ లుక్ రౌడీ అభిమానుల్లో ఆనందం నింపుతోంది. వాస్తవానికి దేవ‌ర‌కొండ‌ నుండి ఏదైనా కొత్త విష‌యం అభిమానులను ఆనందపరుస్తుంది. ఇటీవల లైగ‌ర్ ఫస్ట్ లుక్ పోస్టర్ రావడంతో వారు రెట్టింపు సంతోషంలో ఉన్నారు. ఈ కొత్త పోస్ట‌ర్ తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనాలు సృష్టించింది. ఇక ఈ మూవీ కోసం విజ‌య్ మార్ష‌ల్ ఆర్ట్స్ ట్రైనింగుకి వెళ్లిన సంగ‌తి తెలిసిన‌దే. మాస్ క‌మ‌ర్షియల్ డైరెక్ట‌ర్ పూరి జగన్నాథ్.. విజ‌య్ ని పాన్ ఇండియా స్టార్ గా ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. అందుకు క‌ర‌ణ్ జోహార్ తో భాగ‌స్వామ్యం కుదుర్చుకున్నారు.

అయితే మహమ్మారి వ‌ల్ల షూటింగ్ ఇంత‌కాలం నిలిచిపోయింది. ఇత‌రుల్లానే లైగ‌ర్ బృందం చాలా కాలం వేచి ఉంది. ఎట్ట‌కేల‌కు షూటింగుకు రెడీ అవుతోంది. విజయ్ దేవరకొండ సరసన ఈ చిత్రంలో అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది. 2021 వేసవి చివరిలో ఈ చిత్రం రిలీజ్ కానుంది.