సౌత్ ఇండియా నెంబర్ వన్ హీరోగా రికార్డ్ క్రియేట్ చేసిన రౌడీ...!

Thu Jul 16 2020 16:00:01 GMT+0530 (IST)

Deverakonda Creates Sensation And Breaks Record On Instagram!

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండకు యూత్ లో ఉన్న క్ర్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అనతి కాలంలోనే తన స్టైల్ మరియు డిఫరెంట్ యాటిట్యూడ్ తో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రలు చేసి మెప్పించిన దేవరకొండ.. 'పెళ్లి చూపులు' అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన 'అర్జున్ రెడ్డి' చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసాడు. ఆన్ స్క్రీన్ లోనే కాకుండా ఆఫ్ స్క్రీన్ లో కూడా విజయ్ యాటిట్యూడ్ అందరిని ఆకర్షిస్తుంది. అందుకే అభిమానులు ముద్దుగా 'రౌడీ' అని పిలుచుకునే దేవరకొండ విజయ్.. వారిని 'రౌడీ బాయ్స్' అని పిలుస్తూ కావలసినంత ప్రేమని పంచుతుంటాడు. ఇక విజయ్ దేవరకొండ ఫౌండేషన్ స్థాపించి తన వంతు సాయం చేస్తూ అందరిలోనూ ప్రత్యేకం అనిపించుకుంటూ వస్తున్నాడు. విజయ్ దేవరకొండకి సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు మన రౌడీ దేవరకొండ.ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ఇన్స్టాగ్రామ్ లో 8 మిలియన్ల ఫాలోవర్స్ ను సంపాదించుకొని కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఫస్ట్ హీరోగా నిలిచాడు. దక్షిణాది హీరోల్లో ఎవరికి కూడా ఇన్స్టాగ్రామ్ లో ఇంత మంది ఫాలోవర్స్ లేరు. దీంతో సౌత్ ఇండియాలోనే ఇన్స్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న హీరోగా రికార్డు నెలకొల్పి అగ్ర స్థానంలో నిలిచారు. ప్రస్తుతం రౌడీ అభిమానులు ఇన్స్టాలో అనుసరించేవారి సంఖ్య 80 లక్షల మార్కు దాటడంతో సోషల్ మీడియా వేదికగా సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసారు. కాగా 2018 మార్చి 7న విజయ్ దేవరకొండ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాని ప్రారంభించారు. ఇంత తక్కువ వ్యవధిలోనే 8 మిలియన్ల ఫాలోవర్స్ ని సొంతం చేసుకోవడం ఓ రికార్డుగా చెబుతున్నారు. విజయ్ కు ఇంత మంది పాలోవర్స్ ఉండటానికి కారణం ఆయనను దేశవ్యాప్తంగా అందరూ అభిమానించటమే అని ఫ్యాన్స్ చెప్తున్నారు. విజయ్ దేవరకొండ నటించిన 'అర్జున్ రెడ్డి' 'గీత గోవిందం' 'డియర్ కామ్రేడ్' సినిమాలు హిందీలో డబ్ కావడంతో అక్కడ కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ అయిందని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతుంది. ఈ సినిమాతో మన రౌడీ బాలీవుడ్ లో కూడా తన సత్తా చూపిస్తాడేమో చూడాలి.