'హీరో' కన్ఫ్యూజన్ తప్పేలా లేదే

Wed Oct 16 2019 14:27:27 GMT+0530 (IST)

ఒకే టైటిల్ మీద ఇద్దరు హీరోలు  రెండు బాషలలో కన్ను వస్తే వచ్చే ఇబ్బంది మాములుగా ఉండదు. ముప్పై ఏళ్ళ క్రితం కృష్ణ గారి అబ్బాయి రమేష్ బాబు నందమూరి బాలకృష్ణ ఒకేసారి సామ్రాట్ అనే టైటిల్ కోసం పోటీ పడ్డారు. నిర్మాతలు ఎవరూ వెనక్కు తగ్గకుండా టైటిల్ మాదంటే మాదని పేపర్ యాడ్స్ కూడా ఇచ్చారు. చివరికి ఇండస్ట్రీ పెద్దలు జోక్యం చేసుకుని రాజీ చేయడంతో బాలయ్య సినిమాకు సాహస అని జోడించి సాహస సామ్రాట్ అనే పేరుతో రమేష్ అసలు టైటిల్ తో విడుదల చేసే మార్గం కల్పించారు. అడపాదడపా ఇలాంటి సంఘటనలు పరిశ్రమలో సహజమే.తాజాగా మరోసారి అలాంటి సిచ్యు వేషన్ వచ్చేలా కనిపిస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా మైత్రి సంస్థ ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో హీరో అనే సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.  మరొవైపు తమిళ్ లో శివ కార్తికేయన్ హీరోగా ఇదే హీరో టైటిల్ తో ఇంకో సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం దీని షెడ్యూల్ హైదరాబాద్ లోనే జరుగుతోంది. విజయ్ దేవరకొండ మల్టీ లాంగ్వేజ్ రిలీజ్ కు ప్లాన్ చేసుకున్నాడు. అంటే ఒకే టైటిల్ తో వెళ్ళడం మినహా వేరే మార్గం ఉండదు.

అయితే ఇప్పటికే శివ కార్తికేయన్ హీరో టైటిల్ మీద కర్చీఫ్ వేయడంతో ఎవరు మార్పుకు సిద్ధపడతారో అంతు చిక్కడం లేదు. పరిస్థితి చూస్తే ముందు కార్తికేయన్ సినిమానే షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. అదే కనక జరిగితే విజయ్ దేవరకొండకు చిక్కులు తప్పవు. దీనికి సంబంధించిన క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. తెలుగు హీరో షూటింగ్ ఆగి ఆగి సాగుతోంది. నిర్మాతలు కూడా ఎలాంటి అప్ డేట్ ఇవ్వడం లేదు.