కరణ్ పార్టీకి ఈ తెలుగు జంటకు ప్రత్యేక ఆహ్వానం?

Wed May 25 2022 21:11:58 GMT+0530 (IST)

Vijay Devarakonda Rashmika Mandanna

ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ 50వ పుట్టినరోజు వేడుకల పూర్తి అతిథుల జాబితా తాజాగా విడుదలైంది. దీపికా పదుకొణె- రణవీర్ సింగ్ కేన్స్ నుండి నేటి సాయంత్రం జరగనున్న ఈ పార్టీకి వెళ్లనున్నారు. కింగ్ ఖాన్ షారూఖ్ మరికొందరు ప్రముఖులు హాజరుకానున్నారు. కరణ్ జోహార్ పుట్టినరోజు వేడుకకు ఆహ్వానితులంతా హాజరు కానున్నారు.కరణ్ జోహార్ నేటి ( మే 25న)తో హాఫ్ సెంచరీ కొట్టేసారు. అందుకే అర్ధ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ పార్టీని గ్రాండ్ గా ఏర్పాటు చేసారు. పార్టీ నుంచి కరణ్ ఫోటోషూట్ అంతర్జాలంలో వైరల్ గా మారింది. కరణ్ జోహార్ పుట్టినరోజు పార్టీ ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచే అద్భుతమైన ఈవెంట్ గా సాగుతోంది. ప్రతిష్టాత్మకమైన యష్ రాజ్ స్టూడియోస్ లో ఫ్లోర్ మొత్తం పార్టీ కోసమే బుక్ చేసారట. దీని థీమ్ పూర్తిగా ఎరుపు రంగులో ఉంటుంది. దుస్తుల కోడ్ విషయానికి వస్తే.. అతిథులు ``బ్లాక్ అండ్ బ్లింగ్ ``లో కనిపించాలనేది అభ్యర్థన. కాబట్టి కరణ్ జోహార్ పుట్టినరోజు వేడుకకు అందరూ ఇదే డ్రెస్ కోడ్ తో హాజరుకానున్నారు.  అదృష్టవంతులు అంతా ``కరణ్ జోహార్ 50వ పుట్టినరోజు వేడుక గెస్ట్ లిస్ట్`` లో చేరాము అంటూ కొందరు ట్వీట్లు చేసారు.

కరణ్ జోహార్ కోసమే దీపికా పదుకొణె కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నుండి ఒక రోజు విమానయానంలో హడావుడిగా కనిపించిందట. రణవీర్ సింగ్ కూడా కేన్స్ నుండి ఫ్లైయింగ్ డౌయింగ్ లో తన భార్యతో పాటు కరణ్ వద్దకు వాలిపోతున్నాడు. దీపికా - రణ్ వీర్ తో పాటు రాణి ముఖర్జీ- కరీనా కపూర్ ఖాన్ - మలైకా అరోరా- అలియా భట్- రణబీర్ కపూర్ - కాజోల్ - వరుణ్ ధావన్ - సిద్ధార్థ్ మల్హోత్రా సహా KJo ఇతర సన్నిహిత మిత్రులు కూడా అతని గ్రాండ్ పార్టీకి హాజరుకానున్నారు.

అయితే ఈ ఈవెంట్ కి హాజరు కానున్న ఏకైక దక్షిణాది జంట మాత్రం విజయ్ దేవరకొండ- రష్మిక మందన అని చెబుతున్నారు. దేవరకొండ కరణ్ నిర్మిస్తున్న లైగర్ లో నటిస్తున్నాడు. అలాగే ధర్మ సంస్థలో రష్మిక సినిమాలు చేస్తోంది. భవిష్యత్ లో ఈ ఇద్దరినీ కలుపుతూ ధర్మ సంస్థ ఓ మాంచి లవ్ స్టోరీ తీసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక ఈ జంటకు మాత్రమే ఆహ్వానం దేనికి? అంటే.. ఆ ఇద్దరూ రిలేషన్ లో ఉన్నారని కూడా గుసగుస వినిపిస్తోంది. చివరగా కానీ.. ముఖ్యంగా  కరణ్ జోహార్ కి అత్యంత సన్నిహితుడు కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ పార్టీలో గౌరవ అతిథిగా కనిపించబోతున్నారు.

బాలీవుడ్ నుంచి నేడు సాయంత్రం జరిగే ఈ పార్టీకి  బాలీవుడ్ నుంచి షారుక్ ఖాన్ ఆయన భార్య గౌరి ఖాన్.. మలైకా ఆరోరా- అర్జున్ కపూర్- జాన్వీ కపూర్- కరీనా కపూర్- సైఫ్ అలీ ఖాన్ విచ్చేయనున్నారు.

సారా అలీ ఖాన్ -రణ్ బీర్ కపూర్ - ఆయాన్ ముఖర్జీ - మనీశ్ మల్హోత్రా- రణ్ వీర్ సింగ్ - అనన్య పాండే ఈ పార్టీలో పాల్గొననున్నారు. హాలీవుడ్ మూవీ షూటింగ్ కోసం అమెరికా వెళ్లిన అలియా.. కాన్స్ ఫిలిం ఫెస్టివల్ కోసం ఫ్రాన్స్ లో ఉన్న దీపికా పదుకొనెలు నేడు ముంబై చేరుకున్నట్లు తెలుస్తోంది.