Begin typing your search above and press return to search.

Liger VS VD11 : విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌

By:  Tupaki Desk   |   13 May 2022 2:41 PM GMT
Liger VS VD11 : విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌
X
విజయ్ దేవరకొండ లైగర్ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. ఆగస్టు లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే డేట్‌ ను కూడా ఖరారు చేయడం జరిగింది. ఆగస్టు లో లైగర్‌ విడుదల కాబోతుండగా మరీ ఎక్కువ ఆలస్యం చేయకుండా శివ నిర్వాన దర్శకత్వంలో చేస్తున్న లవ్‌ స్టోరీ సినిమా తో ఇదే ఏడాది చివరి వరకు విజయ్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా తెలుస్తోంది.

లైగర్ సినిమా పాన్ ఇండియా మూవీగా విడుదల కాబోతుంది. దేశ వ్యాప్తంగా లైగర్‌ సినిమా ఖచ్చితంగా ఓ రేంజ్ లో ప్రభంజనం సృష్టించే విధంగా ఉంటుందని యూనిట్‌ సభ్యులు చాలా నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో లైగర్ సినిమాకు సంబంధించిన చర్చ పీక్స్‌ లో ఉంది. ఇదే సమయంలో శివ నిర్వాన దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్‌ గా చేస్తున్న సినిమా విషయంలో కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఈ రెండు సినిమాల గురించి విజయ్‌ దేవరకొండ ఆసక్తికర పోస్ట్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం తన 11వ సినిమా అయిన శివ నిర్వాన సినిమా షూటింగ్‌ లో భాగంగా కశ్మీర్‌ తో పాటు ఉత్తర భారతంలో షూటింగ్‌ లో పాల్గొంటున్నాడు. ఆ సందర్బంగా తీసుకున్న నీటిలో బోటు తో ప్రయాణిస్తున్న వీడియోను షేర్‌ చేశాడు.

ఆ వీడియో తో పాటు లైగర్ సినిమా వర్సెస్ నా 11వ సినిమా. నా కెరీర్‌ లో అతి పెద్ద సినిమా గా లైగర్ నిలుస్తుందని అన్నాడు. ఇక నా 11వ సినిమా అత్యంత విభిన్నమైన బ్యూటీఫుల్‌ లవ్‌ స్టోరీ అన్నాడు. ఈ రెండు సినిమాలు కూడా తప్పకుండా నా కెరీర్ మొత్తం గుర్తుండి పోతాయి అన్నట్లుగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మజిలీ సినిమా తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న శివ నిర్వాన ప్రస్తుతం విజయ్ దేవరకొండ.. సమంత కాంబోలో ఒక మెచ్యూర్డ్‌ లవ్ స్టోరీ తో సినిమాను చేస్తున్నాడు. ఇటీవల కశ్మీర్‌ లొకేషన్‌ నుండి యూనిట్‌ సభ్యుల సందడి చేసిన వీడియోను షేర్‌ చేశారు. అతి త్వరలోనే వీడి 11 సినిమా ఫస్ట్‌ లుక్ ను విడుదల చేయబోతున్నారు. అదే సమయంలో టైటిల్‌ ను రివీల్‌ చేయడంతో పాటు విడుదల తేదీ విషయంలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.