Begin typing your search above and press return to search.

ట్రెండీ స్టోరి: హీరోల న‌గ్న‌త్వం ఏంటో కానీ!

By:  Tupaki Desk   |   3 July 2022 10:41 AM GMT
ట్రెండీ స్టోరి: హీరోల న‌గ్న‌త్వం ఏంటో కానీ!
X
హీరోల యందు కొంద‌రు హీరోలు వేర‌యా విశ్వ‌ధాభిరామ వినుర వేమ‌! ఇన్నాళ్లు హీరోయిన్ల న‌గ్న‌త్వం గురించి.. బికినీ షోలు.. స్విమ్ సూట్ ల గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు ఏకంగా హీరోల న‌గ్న‌త్వం గురించి మాట్లాడుకోవాల్సిన స‌న్నివేశం క‌నిపిస్తోంది.

మొన్న‌టికి మొన్న `లైగర్` లుక్ కి జ‌నం షాక్ తిన్నారు. ఇందులో విజయ్ దేవరకొండ ఆల్మోస్ట్ పూర్తి న‌గ్నంగా క‌నిపించాడు. లైగ‌ర్ న‌గ్న పోస్ట‌ర్ క‌నిపించ‌గానే నెటిజ‌నులు కూడా త‌మ‌దైన శైలిలో స్పందించారు. అక్క‌డ అడ్డు పెట్టుకున్న పుష్ప గుచ్చం స‌రిపోదు అంటూ.. కొంద‌రైతే ఏకంగా ఈ న‌గ్న ఫోటోకి క‌వ‌రింగ్ గా సాలువాలు కూడా క‌ప్పారు. ఈమోజీల‌తో విరుచుకుప‌డ్డారు. పూరి క్రియేటివిటీపై పంచ్ లు ప‌డ్డాయి. టాలీవుడ్ లో ప్ర‌ముఖ హీరో ఒక‌రు లైగ‌ర్ దేవ‌ర‌కొండ న‌గ్న రూపానికి శాలువా క‌ప్పుతున్న పోస్ట‌ర్ వైర‌ల్ అయ్యింది. అదంతా స‌రే కానీ దేవ‌ర‌కొండ కంటే ముందే ఇలా న‌గ్నంగా ఫోజులిచ్చిన హీరోలు ఎంద‌రు ఉన్నారు? అన్న‌ది వెతికితే కొన్ని పేర్లు బ‌య‌ట‌ప‌డ్డాయి.

విజ‌య్ దేవ‌ర‌కొండ కంటే ముందే కిచ్చా సుదీప్- సిద్ధార్థ్ - శ్రీ‌కాంత్ న‌గ్నంగా క‌నిపించే పాత్ర‌ల‌తో స‌ర్ ప్రైజ్ చేసారు. ఇంత‌కుముందు ఎస్.ఎస్.రాజమౌళి తెర‌కెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ `ఈగ`లో ఒక సన్నివేశం కోసం కిచ్చా సుదీప్‌ తన బట్టలన్నీ తీసేసి క‌నిపించాడు. త‌న‌ని వెంటాడి వేధించి త‌రిమికొట్టే ఈగ వ‌ల్ల అత‌డు అన్ని పాట్లు ప‌డ్డాడు. ఆ పాత్ర ఆడియెన్ కి ఒక రేంజులో క‌నెక్ట‌య్యింది.

శంక‌ర్ తెర‌కెక్కించిన బోయ్స్ చిత్రంలో సిద్ధార్థ్ ఒక ఛాలెంజ్ లో నెగ్గేందుకు న‌గ్నంగా న‌డి రోడ్ లో ప‌రిగెత్తుతాడు. జెనీలియాపై తన ప్రేమను నిరూపించుకోవడానికి సిద్ధార్థ్ బిజీగా ఉండే రోడ్ ని నగ్నంగా దాటే ప్ర‌య‌త్నం చేస్తాడు. అది నిజంగా బోయ్స్ మూవీలో స‌ర్ ప్రైజింగ్ గా ఉంటుంది.

శ‌తాధిక చిత్రాల క‌థానాయ‌కుడు శ్రీకాంత్ కెరీర్ లో ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌ల్లో న‌టించి మెప్పించాడు. ఆపరేషన్ దుర్యోధనలో శ్రీ‌కాంత్ న‌గ్నంగా క‌నిపించాడు. త‌న న‌ట‌న‌కు ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ నామినేష‌న్ ని సంపాదించాడు.

ఒంగోలు గిత్తలో ప్రకాష్ రాజ్ పాత్ర స‌ర్ ప్రైజింగ్ ప్యాకేజీగా ఉంటుంది. అస‌లు విలన్లు బట్టలు ఊడదీయడం మనం ఎప్పుడూ చూడలేము. కానీ ప్రకాష్ రాజ్ ఒంగోలు గిత్తలో అలా చేశాడు. అద్దం ముందు నిల‌బ‌డి త‌న న‌గ్న సౌంద‌ర్యాన్ని వీక్షించే మొగోడిగా క‌నిపిస్తాడు. దీనిపై కొన్ని విమ‌ర్శ‌లు కూడా వెల్లువెత్తాయి. కానీ విల‌క్ష‌ణ న‌టుడి ఇమేజ్ ముందు ఏవీ నిల‌బ‌డ‌లేదు.

నాందిలో అల్లరి నరేష్ న‌గ్నంగా క‌నిపించారు. విమర్శకుల ప్రశంసలు పొందిన బాక్సాఫీస్ హిట్ చిత్ర‌మిది. `నాంది`లో జైలు సన్నివేశం కోసం అల్లరి నరేష్ ఇలాంటి సాహసం చేసాడు. నాందికి సీక్వెల్ కూడా తీసే ఆలోచ‌న ఉంది.

కాలీఫ్లవర్ లో సంపూర్ణేష్ బాబు న‌గ్నంగా క‌నిపించాడు. హృద‌య కాలేయం మొద‌లు సెటైరిక‌ల్ కామెడీలు చేసిన సంపూర్ణేష్ ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌ల‌తో మెప్పించాడు. తెలంగాణ న‌టుడు సంపూర్ణేష్ బాబు కాలీఫ్లవర్ లో పూర్తిగా నగ్నంగా కనిపించాడు. ఒక క‌థానాయ‌కుడి హోదాలో అత‌డు ఇలా చేసాడు. ఇది అరుదైన సందర్భం అన‌డంలో సంఏదేహం లేదు.

ఆఫీస్ కి అర్థ‌న‌గ్నంగా అయినా వెళ‌తాను కానీ ఆవిడిచ్చిన చొక్కా తొడ‌గ‌ను అంటూ న‌ట‌కిరీటి రాజేంద్ర‌ప్రసాద్ ఓ సినిమాలో అర్థ‌న‌గ్నంగానే క‌నిపించాడు. పిసినారిగా ఓ సినిమాలో పేప‌ర్లు చుట్టుకుని కూడా క‌నిపించాడు. అంత‌కుముందు కూడా కొంద‌రు న‌టీన‌టులు న‌గ్నంగా క‌నిపించారు. వాటికి చ‌క్క‌ని పేరు వ‌చ్చింది. అమ‌లాపాల్ ఆమె చిత్రంలో న‌గ్నంగా క‌నిపించి షాకిచ్చిన సంగ‌తి తెలిసిందే. క‌థానాయిక‌ల‌ను మ‌న ద‌ర్శ‌కులు ఆల్మోస్ట్ న‌గ్నంగా చూపించేందుకు వెన‌కాడ‌ర‌న్న‌ది తెలిసిందే.