#LIGER మెంటలెక్కించేట్టున్నాడు..!

Wed Sep 15 2021 14:04:28 GMT+0530 (IST)

Vijay Devarakonda In Liger

చూస్తుంటే #LIGER మెంటలెక్కించేట్టున్నాడు. అంతకంతకు హీట్ పెంచే కంటెంట్ ని వెబ్ లో ప్రచారానికి వదులుతూ పూరి-ఛార్మి - దేవరకొండ బృందం చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఇంకా చిత్రీకరణ పూర్తి కాకపోయినా.. ప్రస్తుతం ఈ టీమ్ గోవా లో బడా ప్రణాళికలతో ఉన్నా.. ఇంతలోనే రకరకాలుగా కాకలు పుట్టించే అప్ డేట్ లను లీకులిస్తూ హీట్ పుట్టించేస్తున్నారు.చూస్తుంటే విజయ్ ఫ్యాన్స్ కి క్రాక్ పుట్టించడం ఖాయంగానే కనిపిస్తోంది. ఈ సినిమాలో అతడు నెవ్వర్ బిఫోర్ అన్న తీరుగా కనిపించనున్నాడు. ఇన్నేళ్లలో ఎందరో హీరోలను లుక్ పరంగా అమాంతం మార్చేసిన పూరి జగన్నాథ్ ఇప్పుడు లైగర్ చిత్రంతో దేవరకొండను కూడా అంతే గొప్పగా మార్చేశాడు. లైగర్ అన్న టైటిల్ కి తగ్గట్టే అతడిలోని క్రాస్ బ్రీడ్ ని బయటపెడుతున్నాడు. కండలు మెలితిరిగిన దేహంతో పిలకముడితో విజయ్ దేవరకొండ కనిపిస్తున్న  తీరు ఆశ్చర్యపరుస్తోంది. అలా రింగ్ లో రిలాక్స్ డ్ గా కూర్చుని ప్రాక్టీస్ సెషన్స్ ని వీక్షిస్తున్నట్టే కనిపిస్తోంది.

జస్ట్ శాంపిల్ కోసం వదిలాడా? అన్నట్టు లైగర్ ని వెనక వైపుగా చూపించాడు. మిక్స్ డ్ మార్షల్ ఆర్టిస్టుగా దేవరకొండ లుక్ కి ఇది సింబాలిక్. ఇక రింగ్ లోకి దిగాక శత్రువును ఎలా మట్టి కరిపించబోతున్నాడు? అన్నది తెరపైనే చూడాలి. బహుశా పూరి ఈ సినిమాని నెవ్వర్ బిఫోర్ అన్న తీరుగా తెరకెక్కిస్తారనే అంతా ఆశిస్తున్నారు. ఇంతకుముందు అనన్య పాండే డాడీ చుంకీ పాండే నేరుగా దేవరకొండ లుక్ ని హార్డ్ వర్క్ ని ఎంతగానో ప్రశంసించాడు. అంతకుముందు ఆర్జీవీ సైతం టాలీవుడ్ లో ఏ స్టార్ హీరోకి దేవరకొండ తక్కువేమీ కాదు అంటూ కితాబిచ్చేశారు. అందుకే ఈ లుక్ రాగానే అందరిలో ఒకటే ఉత్కంఠ నెలకొంది. పెండింగ్ చిత్రీకరణను శరవేగంగా పూర్తి చేసి రిలీజ్ చేయాలన్న తపనతో ఉన్న పూరి ప్రస్తుతం ఆ పనిలో ఉన్నాడు. ఛార్మి టీమ్ కి అవసరమైన సాయం చేస్తున్నారు. ఇక వియ్ ని బాలీవుడ్ లో మరో లెవల్ లో ఆవిష్కరించేందుకు గురుడు కరణ్ జోహార్ చేయాల్సినదంతా చేస్తున్నారు. ఓవరాల్ గా తెలుగు-తమిళం-హిందీలో లైగర్ తో విజయ్ కాకలు పుట్టిస్తాడనే అంచనా వేస్తున్నారు. సౌత్ అన్ని భాషల్లోనూ ఈ చిత్రం అనువాదమై రిలీజ్ కానుంది.

గోవాలో రమ్య మ్యాడమ్ బర్త్ డే వేడుకలు?

షూటింగులకు ఎక్కువగా ఇండియాలో  గోవాలో అనుమతులు సులభంగా  దొరుకుతాయి. నిబంధనలు పెద్దగా ఉండవు కాబట్టి ఎక్కువగా గోవాకే ప్రాధాన్యత ఇస్తారు. అందుకే గోవా షూట్ కి పూరి ప్రాధాన్యతనిచ్చారని గుసగుసలు వినిపించాయి. ఇక సెప్టెంబర్ 15న రమ్యకృష్ణ పుట్టిన రోజు కానుక ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. లైగర్ లో సీనియర్ నటి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె పాత్రక సంబంధించిన అప్ డేట్ తో పాటు..ఇతర విషయాలు వెల్లడించే అవకాశం  ఉందని భావిస్తున్నారు.

అలాగే లైగర్ చిత్రంతో దేవరకొండ రేంజు మారనుంది. ఈ సినిమాని హిందీలో అత్యంత భారీగా రిలీజ్ చేసేందుకు కరణ్ జోహార్ సన్నాహకాల్లో ఉన్నారని తెలిసింది. ఎంతగా అంటే రజనీకాంత్ సినిమాని మించి ప్రభాస్ తర్వాత విజయ్ అనేంతగా అతడిని ప్రమోట్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారట.  విజయ్ ని స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ వరుణ్ ధావన్ ని పరిచయం చేసినంత వైబ్రేంట్ గా పరిచయం చేయాలని కరణ్ భావిస్తున్నారని టాక్ ఉంది.