దేవరకొండ హీరో మొదలైంది

Sun May 19 2019 14:21:31 GMT+0530 (IST)

Vijay Devarakonda Hero Movie Launched

యూత్ లో చాలా ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉన్న విజయ్ దేవరకొండ హీరోగా మారబోతున్నాడు. అదేంటి ఆల్రెడీ స్టార్ కదా మళ్ళీ హీరో కావడం ఏమిటి అనుకుంటున్నారా. సినిమా పేరే హీరో. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో రూపొందుతున్న బై లింగ్వల్ మూవీ హీరో షూటింగ్ ఈ రోజు లాంఛనంగా ప్రారంభమయ్యింది. కొరటాల శివతో పాటు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అతిధులుగా వచ్చిన ఈ ఈవెంట్ ని పెద్దగా హంగామా లేకుండా సింపుల్ గా కానిచ్చేశారు.హీరోయిన్ గా పేట ఫేమ్ మాళవిక మోహనన్ టాలీవుడ్ కు పరిచయమవుతోంది. బైక్ రేస్ స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ కోసమే ఇటీవలే ప్రత్యేకంగా ఫోటో షూట్ చేశారు. అందులో విజయ్ దేవరకొండ లుక్స్ బైక్ రైడర్ గా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతున్నాయి అని నమ్మకం కుదిరాకే మొదలుపెట్టారు

భారీ బడ్జెట్ తో రూపొందుతున్న హీరోని తెలుగు తమిళ్ లో సమాంతరంగా రూపొందిస్తున్నారు. డియర్ కామ్రేడ్ తర్వాత విజయ్ దేవరకొండ మైత్రికి చేస్తున్న రెండో సినిమా ఇది. యాక్షన్ తో పాటు ఎంటర్ టైన్మెంట్ ని సమాంతరంగా మిక్స్ చేస్తూ అభిమానులను అలరించే విధంగా హీరో ఉంటుందని దర్శకుడు చెబుతున్నారు.

హీరో టైటిల్ తో గతంలో చిరంజీవి నితిన్ లు చెరో సినిమా చేశారు. జాకీ ష్రాఫ్ ని స్టార్ చేసింది ఈ టైటిల్ తో వచ్చిన సినిమానే. మరి ఇది విజయ్ దేవరకొండ రేంజ్ ని ఎక్కడికి తీసుకెళ్తుందో చూడాలి. డియర్ కామ్రేడ్ పూర్తి కావడంతో ఇప్పుడు మైత్రి ఫోకస్ హీరో మీదే పెట్టనుంది