మరో అరుదైన ఫీట్ సాధించిన VD.. కోటికి చేరిన ఫాలోవర్స్..!

Tue Jul 20 2021 23:00:01 GMT+0530 (IST)

Vijay Devarakonda Facebook Family Grows Bigger And Touches 1 Crore

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కు నేషనల్ వైడ్ ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'పెళ్లి చూపులు' సినిమాతో పూర్తి స్థాయి హీరోగా మారిన యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ.. 'అర్జున్ రెడ్డి' సినిమాతో యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కు.. ఇన్స్టాగ్రామ్ లో 12.5 మిలియన్ల (1 కోటీ 25 లక్షల మంది) ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్స్టా లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న సౌత్ హీరోగా VD రికార్డ్ సృష్టించాడు. ఈ క్రమంలో తాజాగా విజయ్ సోషల్ మీడియా మాధ్యమాల్లో మరొక మైల్ స్టోన్ ను అధిగమించాడు.సోషల్ మీడియా మధ్యమాలలో ఒకటైన 'ఫేస్ బుక్' లో విజయ్ దేవరకొండ 10 మిలియన్ల ఫాలోవర్స్ మార్క్ ను అందుకున్నాడు. అంటే ఫేస్ బుక్ లో వీడీ ని కోటి మంది అనుసరిస్తున్నారన్నమాట. FB లో విజయ్ దేవరకొండ 10 మిలియన్ ఫాలోవర్స్ ను సొంతం చేసుకోవడం పట్ల ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా విజయ్ ట్వీట్ చేస్తూ ''మేల్కొనండి.. వర్క్ చేయండి.. విజయం సాధించండి'' అని పేర్కొన్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. విజయ్ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో ''లైగర్'' అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ధర్మ ప్రొడక్షన్స్ మరియు పూరీ కనెక్ట్స్ బ్యానర్స్ పై కరణ్ జోహార్ - పూరీ - ఛార్మీ కౌర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఈ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెడుతోంది. మిక్డ్స్ మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో విజయ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. త్వరలోనే యంగ్ హీరో షూట్ లో జాయిన్ కానున్నాడు. దీని తర్వాత వీడీ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రూపొందనుంది.