ఆత్రేయను ముంచెత్తిన అర్జున్ రెడ్డి

Tue Jun 25 2019 16:06:40 GMT+0530 (IST)

ఇటీవలే విడుదలై మంచి టాక్ తో దూసుకుపోతున్న ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయకు సెలబ్రిటీల మద్దతు పెరుగుతోంది. ఇవాళ ఏఎంబి సినిమాస్ లో విజయ్ దేవరకొండ-అడవి శేష్-తరుణ్ భాస్కర్ తదితరులు కలిసి ప్రత్యేకంగా షో చూశారు. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్ లో విజయ్ దేవరకొండ హీరో నవీన్ పోలిశెట్టిని ప్రత్యేకంగా పొగడటం అందరిని ఆశ్చర్యపరిచింది. నిజానికి ఈ ఇద్దరికీ ఎప్పటి నుంచో పరిచయముంది. ట్రైలర్ విడుదలైనప్పుడు నవీన్ విజయ్ దేవరకొండకు లింక్ ని మెసేజ్ చేస్తూ చాలా ఎమోషనల్ అయ్యాడట.దానికి బదులుగా ధైర్యం ఇస్తూ సినిమా హిట్టయినా ఫ్లాప్ అయినా సెలెబ్రేట్ చేసుకుందామని ఇక్కడి దాకా రావడమే ఒక అఛీవ్మెంట్ అని ధైర్యం చెప్పిన సందర్భాన్ని ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ గుర్తు చేశాడు అంతేకాదు మావాడు వచ్చాడు ఇంకొకడు వచ్చాడు అని విజయ్ రెండు మూడు సార్లు నొక్కి చెప్పడం గమనార్హం

ఇలాంటోడు(నవీన్ పోలిశెట్టిని ఉద్దేశించి)ఇండస్ట్రీలో ఇంకొకడు లేడు అని చెప్పడం కూడా నవీన్ కు బోలెడు ప్రోత్సాహాన్ని ఇచ్చిందినే చెప్పాలి. మొత్తానికి ఈ షో సందర్భంగా విజయ్ నవీన్ ల మధ్య స్నేహం ఉందన్న సంగతి బయటపడింది. ఇది ఖచ్చితంగా కలెక్షన్స్ పరంగా హెల్ప్ అయ్యేదే. ఇప్పటికే సిటీస్ లో స్క్రీన్లు పెంచుకున్న ఏజెంట్ ఆత్రేయ కీలకమైన కేంద్రాలు అన్నింటిలో మంచి రన్ కొనసాగిస్తున్నాడు. ఇంకా ఫస్ట్ వీక్ పూర్తవ్వలేదు కాబట్టి ఏ రేంజ్ హిట్ అనేది స్పష్టత లేదు కానీ మొన్న ఫ్రైడే వచ్చిన మూవీస్ లో కమర్షియల్ గానూ ఇదే ఫస్ట్ ప్లేస్ లో కొనసాగుతోంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ ఇంత స్పెషల్ గా చెప్పాడు కాబట్టి అతని ఫాన్స్ సపోర్ట్ కూడా ఆత్రేయకు దక్కనుంది