Begin typing your search above and press return to search.

రౌడీ - సుక్కూ మూవీ నేపథ్యం ఇదేనంటూ ఆసక్తికర పుకారు

By:  Tupaki Desk   |   18 Oct 2020 1:30 AM GMT
రౌడీ - సుక్కూ మూవీ నేపథ్యం ఇదేనంటూ ఆసక్తికర పుకారు
X
విజయ్‌ దేవరకొండ.. సుకుమార్‌ ల కాంబోలో మూవీ అధికారికంగా ప్రకటన వచ్చింది. ప్రస్తుతం వీరిద్దరు చేస్తున్న సినిమాలు పూర్తి అయిన తర్వాత వీరి కాంబో మూవీ ప్రారంభం అవ్వబోతుంది. పుష్ప సినిమాను వచ్చే ఏడాది ద్వితీయార్థం వరకు సుకుమార్‌ పూర్తి చేయబోతున్నాడు. ఇక విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం చేస్తున్న పూరి మూవీ తర్వాత శివ నిర్వాన దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. ఆ తర్వాత వచ్చే ఏడాది ద్వితీయార్థంలో సుకుమార్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ మూవీ పట్టాలెక్కబోతుందట.

ఇక వీరిద్దరి కాంబో మూవీ ఇండో పాకిస్తాన్‌ విడిపోయినప్పటి పరిస్థితులు ఆ సమయంలో రెండు దేశాల బోర్డర్‌ లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సాగుతుందట. ఇండియన్‌ సోల్జర్‌ గా విజయ్‌ దేవరకొండ కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇండియా పాకిస్తాన్‌ మద్య యుద్దం వచ్చిన సమయంలో హీరో పడే సంఘర్షణ ఆ యుద్దంలో అతడి పోరాటం సినిమాలో కీలకంగా ఉంటుందని పుకార్లు వినిపిస్తున్నాయి. మంచి పాయింట్‌ అవ్వడంతో సినిమాపై అప్పుడే అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి.

ఇదే కనుక నిజం అయితే విజయ్‌ దేవరకొండ సినీ కెరీర్‌ లో ఇది నిలిచి పోయే సినిమా అవుతుందని.. కెరీర్‌ లో మరో రెండు మూడు స్టెప్పులు ముందుకు వెళ్లినట్లు అవుతుందని అంటున్నారు. ఈ పుకార్లలో నిజం ఎంత ఉందో కాని ప్రేక్షకుల్లో ఆసక్తి మాత్రం కలిగిస్తుంది. నిప్పు లేనిదే పొగ రాదు అంటారు మరి నిజంగానే సుకుమార్‌ ఈ కాన్సెప్ట్‌ తో పీరియాడిక్‌ డ్రామాను తెరకెక్కించబోతున్నాడా అనే విషయం తెలియాలంటే వచ్చే ఏడాది వరకు వెయిట్‌ చేయాల్సిందే.