లిల్లి బాబీల కష్టం మాములుగా లేదే

Sat Jul 20 2019 12:53:53 GMT+0530 (IST)

డియర్ కామ్రేడ్ ప్రమోషన్ కోసం విజయ్ దేవరకొండ రష్మిక మందన్నలు పడుతున్న కష్టం మాములుగా లేదు. అక్కడా ఇక్కడా అని లేకుండా కాళ్లకు చక్రాలు కట్టుకుని మరీ ఊరూరూ తిరిగేస్తున్నారు. ఇప్పటికే నాలుగు నగరాల్లో ఈవెంట్లు చేసిన కామ్రేడ్ టీమ్ ఇంకో ఆరు రోజుల్లో విడుదల కాబోతున్న తమ సినిమా రిజల్ట్ పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. స్టార్ స్టేటస్ కి ఇంకొద్ది దూరంలోనే విజయ్ దేవరకొండ ఉన్నాడని భావిస్తున్న అభిమానులు డియర్ కామ్రేడ్ తో అది పూర్తిగా నెరవేరుతుందని ఆశిస్తున్నారు.ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడం ఆడియో సైతం హిట్ కావడం ఇవన్నీ పాజిటివ్ సిగ్నల్స్ గానే కనిపిస్తున్నాయి. హిట్ టాక్ వస్తే మంచి వసూళ్లు యావరేజ్ అనిపించుకున్న సేఫ్ కలెక్షన్స్  అనే తరహాలో బజ్ క్రియేట్ అయిన ఈ సినిమాను అలా జరగాలని విజయ్ దేవరకొండ కోరుకోవడం లేదు. బ్లాక్ బస్టర్ లేదా ఇండస్ట్రీ హిట్ కొట్టాలనే కసితోనే ఉన్నాడు. డబ్బింగ్ వెర్షన్ రూపంలో వెళ్తున్న కన్నడ తమిళ మలయాళం కోసం అంత రిస్క్ చేసి వేడుకలు చేయాల్సిన అవసరం లేదు.

కానీ కథలో ఉన్న యూనివర్సల్ అప్పీల్ అందరికి కనెక్ట్ అవుతుందన్న నమ్మకమే ఇంత శ్రద్ధ తీసుకునేలా చేస్తోంది. ఎంత బిజీగా ఉన్నా రష్మిక మందన్న సైతం పబ్లిసిటీ కోసం తన వంతు సహకారం పూర్తిగా ఇస్తోంది. కథలోలోని మెయిన్ ఫోకస్ లో తనకూ చాలా ప్రాధాన్యం ఉండటం రొమాన్స్ తో పాటు పెరఫార్మన్స్ కు స్కోప్ ఉన్న రోల్ డిజైన్ చేయడంతో తానూ ఎంత చేయాలో అంతా చేస్తోంది. మరి ఈ లిల్లీ బాబీ(విజయ్ రష్మికల పాత్రల పేర్లు)పడుతున్న కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుందో లేదో  ఇంకో ఆరు రోజుల్లో తేలిపోతుంది