విజయ్.. చిరు ప్రభాస్ భయం లేనట్లే!

Thu Oct 06 2022 23:00:01 GMT+0530 (India Standard Time)

Vijay Chiru Prabhas Upcoming Movies

మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా పరవాలేదు అనే విధంగా మంచి టాక్ అయితే అందుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఇంకా పెట్టిన పెట్టుబడి రావాలి అంటే ఈ స్థాయిలో అయితే ఓపెనింగ్స్ అందుకుంటే సరిపోదు. అయితే ఎప్పటిలాగే మెగాస్టార్ సినిమాలపై పెదవి విరిచే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఇక మరోవైపు ఇటీవల ప్రభాస్ మరో డిజాస్టర్ అందుకోవడం కాయమే అనే విధంగా కూడా కామెంట్లు వస్తున్నాయి.ఆదిపురుష్ సినిమా టీజర్ ఎలాంటి టాక్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందులో ఉండే గ్రాఫిక్స్ అసలు బాగోలేవు అని ఈ సినిమా కూడా సక్సెస్ కావడం కష్టమే అని అంటున్నారు. అయితే ఈ విధంగా చిరంజీవి ప్రభాస్ ఒకేసారి నెగిటివ్ కామెంట్స్ అందుకోవడంతో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కు బాగా కలిసొచ్చే అవకాశం ఉన్నట్లుగా అనిపిస్తోంది.

విజయ్ చాలాకాలం తర్వాత తెలుగులో తనకంటూ ఒక మార్కెట్ సంపాదించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అతను నటించిన మాస్టర్ సినిమా మంచి ఓపెనింగ్స్ అందుకుంది. ఆ తర్వాత బీస్ట్ కూడా అదే తరహాలో విడుదలైంది. కానీ సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో పెద్దగా కలెక్షన్స్ అయితే రాలేదు. ఇక ఇప్పుడు అతని నమ్మకం మొత్తం వారసుడు సినిమాపైనే ఉంది.

అందులోను ఈ సినిమాను తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి తెరపైకి తీసుకు వస్తున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు కాబట్టి కలిసి వచ్చే అంశం. అయితే ఈ సినిమాను 2023 సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్నారు. అదే సమయంలో చిరంజీవి భోళా శంకర్ కూడా రానుంది. ఇక ఆధిపురుష్ సినిమా కూడా సంక్రాంతికి విడుదల కానుంది.

అయితే గాడ్ ఫాదర్ ప్రభావం భోళాశంకర్ పై గట్టిగానే పడనుంది. దానికి తోడు షాడో శక్తి లాంటి డిజాస్టర్స్ అందుకున్న మెహెర్ రమేష్ డైరెక్ట్ చేస్తూ ఉండడం మరొక పెద్ద మైనస్ పాయింట్.

ఇక ఆదిపురుష్ సినిమా కూడా ఇదే తరహా గ్రాఫిక్స్ సినిమాలో ఎక్కువగా ఉంటే నిలదొక్కుకోవడం కష్టమే. ఇక ఈ రెండు సినిమాలతో విజయ్ కు పెద్దగా పోటీ ఉండకపోవచ్చు. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా విజయ్ బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ అందుకునే అవకాశం అయితే ఉంటుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.