భయం లేకుండా పోరాడమంటున్న కామ్రేడ్

Sat Jul 20 2019 10:55:53 GMT+0530 (IST)

నిన్న జరిగిన డియర్ కామ్రేడ్ మ్యూజికల్ నైట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. విజయ్ దేవరకొండ రష్మిక మందన్నలు అందులో పాటలకు హుషారుగా స్టెప్పులు వేయడం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. వచ్చే శుక్రవారమే విడుదల ఉండటంతో విజయ్ దేవరకొండ చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాడు. నిన్న మాటల్లో బయట పడింది కూడా. తాను ముందు యాక్టర్ అవుతానని అనుకోలేదని ఒక్కసారి అది మనసులో సంకల్పించుకున్నాక భయం పోయి ఆ స్థానంలో లక్ష్యం కోసం పోరాటం చేయాల్సిన కసి ఏర్పడిందని డియర్ కామ్రేడ్ లో అదే ఉంటుందని చెప్పాడు.అంటే ప్రతి ఒక్కరి జీవితంలో మనకు ఇష్టమైన దాని గురించి ఫైట్ చేస్తామని ఇందులో హీరో దేని కోసం ఎవరి కోసం ఫైట్ చేశాడో తెలియాలంటే డియర్ కామ్రేడ్ చూడాలని కోరాడు. అంతేకాదు మనలో ఉన్న ప్రతి ఒక్కరిలో ఓ కామ్రేడ్ ఉన్నాడని చెప్పడం ఫ్యాన్స్  కి మంచి కిక్ ఇచ్చింది. ఇప్పటికే ప్రీ రిలీజ్ బుకింగ్స్ లో ట్రెండ్ సృష్టించే దిశగా పరుగులు పెడుతున్న డియర్ కామ్రేడ్ మీద ఇటు ప్రేక్షకులతో పాటు ట్రేడ్ లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. గీత గోవిందం తర్వాత ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం వ్యక్తమవుతోంది.

దీనికి తగ్గట్టే ప్రమోషన్ విషయంలో రాజీ పడకుండా భారీ ఎత్తున కొచ్చి బెంగుళూరు చెన్నై హైదరాబాద్ లలో ఈవెంట్ల చేయడంతో హైప్ ఎక్కడికో వెళ్ళిపోయింది. తమిళ్ మార్కెట్ లో పట్టు కోసం ట్రై చేస్తున్న విజయ్ దేవరకొండకు ఇది కనక హిట్ అయితే కిక్ మాములుగా ఉండదు. భరత్ కమ్మ దర్శకుడిగా పరిచయమవుతున్న డియర్ కామ్రేడ్ కు జస్టిన్ ప్రభాకరన్ అందించిన సంగీతం ఇప్పటికే చార్ట్ బస్టర్ లో ఉంది