Begin typing your search above and press return to search.
బన్నీ ఒక ‘అద్బుతం’ అంటున్న బాలీవుడ్ స్టార్
By: Tupaki Desk | 17 July 2020 11:10 AM GMTఅల్లు అర్జున్ అంటే తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాకుండా మలయాళ ఆడియన్స్ కు కూడా చాలా అభిమానం. మొన్నటి వరకు సౌత్ వరకే పరిమితం అయిన అల్లు అర్జున్ క్రేజ్ ఇప్పుడు బాలీవుడ్ వరకు చేరింది. బన్నీ నటించిన పలు సినిమాలు ఉత్తరాదిన హిందీలో డబ్ అయ్యి యూట్యూబ్ ద్వారా శాటిలైట్ ద్వారా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నాయి. రికార్డు స్థాయి వ్యూస్ ను బన్నీ డబ్బింగ్ చిత్రాలు దక్కించుకుంటున్నాయి. ఈ సమయంలోనే బాలీవుడ్ స్టార్స్ కూడా అల్లు అర్జున్ ను అభిమానిస్తున్నారు.
అల వైకుంఠపురంలో చిత్రం విడుదలైన తర్వాత పలువురు బాలీవుడ్ స్టార్స్ ఇంకా సెలబ్రెటీలు అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపించారు. ఆయన చేసిన బుట్టబొమ్మ సాంగ్ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఫేమస్ అయ్యింది. గతంలో బాలీవుడ్ కు చెందిన పలువురు బన్నీపై ప్రశంసలు కురిపించడంతో పాటు తమకు బన్నీ అంటే అభిమానం అంటూ చెప్పడంతో ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఒక కథనం రాసింది. అందులో బాలీవుడ్ స్టార్స్ కు ఎందుకు బన్నీ అంటే ప్రత్యేకమైన అభిమానం అంటూ విశ్లేషణాత్మక కథనంను రాయడం జరిగింది.
ఆ మీడియా సంస్థ రాసిన కథనంపై బాలీవుడ్ యంగ్ స్టార్ విధ్యుత్ జమాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాలీవుడ్ వారికి ఎందుకు బన్నీ అంటే అభిమానం అనే ప్రశ్నకు సమాధానంగా జమాల్ అతడో ‘అద్బుతం’. అందుకే ప్రతి ఒక్కరు అతడిని అభిమానిస్తారు అంటూ పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ బన్నీ ఫ్యాన్స్ ను ఆకర్షిస్తోంది. అల్లు అర్జున్ ఇదే క్రేజ్ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. పుష్ప చిత్రంను సుకుమార్ పాన్ ఇండియా చిత్రంగా రూపొందిస్తున్నాడు. పుష్ప చిత్రంతో బాలీవుడ్ లోకి బన్నీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే అక్కడ మంచి క్రేజ్ ఉండటంతో పాటు బాలీవుడ్ ప్రముఖులు బన్నీ ‘అద్బుతం’ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్న కారణంగా పుష్పతో ఖచ్చితంగా స్టైలిష్ స్టార్ కు గ్రాండ్ ఎంట్రీ దక్కే అవకాశం ఉందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.