Begin typing your search above and press return to search.

హ‌ర హ‌రా! క‌మెడియ‌న్ కి ఈ క‌ష్టాలేల‌?

By:  Tupaki Desk   |   13 Sep 2019 1:30 AM GMT
హ‌ర హ‌రా! క‌మెడియ‌న్ కి ఈ క‌ష్టాలేల‌?
X
లాయ‌ర్ల కుటుంబం నుంచి వ‌చ్చిన న‌టి విద్యుల్లేఖ రామ‌న్. ఫ్యామిలీలో ఎక్కువ‌మంది న్యాయ‌శాస్త్రంలో ప‌ట్టాలు పుచ్చుకుని లాయ‌ర్లు అయితే తాను మాత్రం న‌ట‌న‌లో శిక్ష‌ణ తీసుకుని న‌టి అయ్యారు. తెలుగు-త‌మిళ ప‌రిశ్ర‌మ‌ల్లో విద్యుల్లేఖ క‌మెడియ‌న్ గా పాపుల‌ర‌య్యారు. త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన ఆహార్యం ఉంది. త‌న చేత‌లు.. చేష్ట‌లు ఫ్యాన్స్ కి ఈజీగా న‌వ్వు పుట్టిస్తాయి. అలా క‌నెక్ట‌వ్వ‌డంతో త‌న‌కంటూ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. అయితే ఇటీవ‌ల తెలుగులో కామెడీ సినిమాల ద‌ర్శ‌కులు త‌గ్గి.. పూర్తి స్థాయి కామెడీ సినిమాలు లేక‌పోవ‌డంతో ఆ ప్ర‌భావం క‌మెడియ‌న్ల‌పై తీవ్రంగా ప‌డింది. అలాగే విద్యుల్లేఖ‌కు అవ‌కాశాలు త‌గ్గాయి.

ఇటీవ‌ల విద్యుల్లేఖ కెరీర్ సందిగ్ధంలోనే ఉంది. ఆ క్ర‌మంలోనే ఇదిగో ఇలా కొత్త ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టే క‌నిపిస్తోంది. లావు పాటి దేహ‌శిరుల్లో మార్పు కోరుతూ నిరంత‌రం జిమ్ముల్లో చాలానే శ్ర‌మిస్తోంద‌ని ఇన్ స్టా ఫోటోలు చెబుతున్నాయి. వ్యాయామానికి త‌గ్గ‌ట్టే ఫ‌లితం కూడా త‌న రూపంలో క‌నిపిస్తోంది. ఇప్పుడు పూర్తిగా స‌న్న‌బ‌డింది. ఇంత‌కుముందుతో పోలిస్తే ట్రిమ్ గా మారిపోయింది.

అయితే మారిన ఈ రూపం చూశాక ఇంత‌కుముందు అవ‌కాశాలిచ్చిన వాళ్లు అయినా ఇస్తారా? అన్న‌ది సందేహ‌మే. ప్ర‌స్తుత రూపానికి త‌గ్గ‌ట్టు త‌నకు ఆఫ‌ర్ చేసే పాత్రల తీరు మారాల్సి ఉంటుంది. ఇంత‌కుముందులా కామెడీ వెంట‌నే వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌చ్చు. చూడ‌గానే న‌వ్వు కూడా రాదు. అయితే తానేమైనా కామెడీ నుంచి మారి కంగ‌న‌లా మార్ష‌ల్ క్వీన్ పాత్ర‌లు చేయ‌బోతోందా? అన్న‌ది విద్యూనే చెప్పాల్సి ఉంటుంది.