Begin typing your search above and press return to search.

`స‌ర్కార్ వారి పాట‌`లో డ‌ర్టీ పిక్చ‌ర్ చూపిస్తారా?!

By:  Tupaki Desk   |   20 Sep 2020 8:33 AM GMT
`స‌ర్కార్ వారి పాట‌`లో డ‌ర్టీ పిక్చ‌ర్ చూపిస్తారా?!
X
విద్యాబాలన్ .. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు ఇది. ఇంత‌కుముందు న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన ఎన్టీఆర్ బ‌యోపిక్ లో బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో ట్రెడిష‌న‌ల్ గా న‌టించి మెప్పించారు. అంత‌కుముందు విజ‌య‌వాడ‌కు చెందిన‌ తెలుగ‌మ్మాయి విజ‌య‌ల‌క్ష్మి అలియాస్ సిల్క్ స్మిత జీవిత‌క‌థ తో తెర‌కెక్కించిన డ‌ర్టీ పిక్చ‌ర్ లోనూ న‌టించింది. విల‌క్ష‌ణ పాత్ర‌ల‌తో ఇప్ప‌టికే అటు హిందీ ఆడియెన్ తో పాటు సౌత్ కి ద‌గ్గ‌రైన భామ బాల‌న్.

ఇటీవ‌లే అమెజాన్ ప్రైమ్ లో బాల‌న్ న‌టించిన శ‌కుంత‌లాదేవి విడుద‌లై విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందింది. గ‌ణిత శాస్త్ర‌వేత్త‌గా బాల‌న్ న‌ట‌న‌కు ముగ్ధుల‌య్యారంతా. తాజా స‌మాచారం ప్ర‌కారం.. మహేష్ న‌టిస్తున్న `సర్కారు వారి పాట`లో విద్యా బాల‌న్ కీలక పాత్ర పోషించ‌నున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో మహేష్ సోదరిగా నటించడానికి విద్యాను సంప్రదించారని తెలిసింది.

దసరా సీజ‌న్ లో అమెరికాలో ఈ ప్రాజెక్ట్ తెర‌కెక్క‌నుంది. వాషింగ్టన్ DC లో ఒక నెల రోజుల షెడ్యూల్ ప్లాన్ చేశార‌ని.. ఇప్పటికే వీసా ఫార్మాలిటీ స్ ను ప్రారంభించార‌ని తె‌లుస్తోంది. ప్రస్తుత క్రైసిస్ స‌న్నివేశం మరింత దిగజారకపోతే టీమ్ దసరా నాటికి అమెరికాకు ప్రయాణిస్తుంది.

అలాగే ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ న‌టీనటుల్ని ఫైన‌ల్ చేస్తున్నారు. కీర్తి సురేష్ లేదా వేరొక బాలీవుడ్ నాయిక ఈ మూవీలో న‌టించే వీలుంద‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. అనీల్ కపూర్ విల‌న్ గా న‌టిస్తార‌ని ప్ర‌చార‌మ సాగుతోంది. అయితే ఆ పాత్రను ఆఫ‌ర్ చేసినా అట్నుంచి ఓకే చెప్పాల్సి ఉంద‌ట‌. అలాగే ఇందులో కన్నడ నటుడు కిచ్చా సుదీప్ న‌టించే వీలుంది.