వీడియో : మొగుడితో రోడ్డు మీదే దుకాణం పెట్టేసిన హీరోయిన్!

Sat Jul 02 2022 13:00:00 GMT+0530 (IST)

Video: Shriya Saran Holiday Trip Petersburg

సౌత్ సినిమా ల్లో దాదాపుగా రెండు దశాబ్దాలుగా నటించి.. ఇప్పటికి కూడా వచ్చిన అవకాశంను కాదనుకుండా చిన్న సినిమా అని ఆలోచించకుండా సినిమాలు చేస్తున్న ముద్దుగుమ్మ శ్రియ శరన్. తెలుగు లో ఈమె ప్రస్థానం గురించి చెప్పాలంటే చాలా పెద్దదే. తెలుగు లో సీనియర్ మరియు జూనియర్ స్టార్ హీరోల్లో దాదాపు అందరితో కలిసి నటించిన ఘనత కేవలం ఈమెకు మాత్రమే దక్కింది.పెళ్లి అయిన తర్వాత కూడా సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడు ఈమద్య ఎక్కువ సమయం హాలీడే ట్రిప్స్ ను ఎంజాయ్ చేస్తోంది. భర్తతో కలిసి ఈ అమ్మడు పార్టీలకు.. బీచ్ లకు తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ కొత్త ప్రదేశాలను చుట్టేస్తున్నారు. అందుకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా శ్రియ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ తన ఫాలోవర్స్ ను అలరిస్తూ ఉంది.

హీరోయిన్ గా శ్రియకు దక్కిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. అందుకే ఆమెకు ఇన్ స్టా లో మూడున్నర మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఆ సంఖ్య స్పీడ్ గా పెరుగుతూనే ఉంది. తన కూతురు తో మరియు భర్తతో ఉన్న ఫోటోలు మరియు వీడియోలను రెగ్యులర్ గా షేర్ చేసే శ్రియ శరన్ తాజాగా మరో వీడియోను షేర్ చేసింది.

ఆ వీడియో లో భర్తకు లిప్ లాక్ ఇచ్చి అందరిని ఆశ్చర్యపర్చింది. ఇలా రోడ్డు మీదే ముద్దులు ఏంటి శ్రియ అంటూ సరదాగా ఫ్యాన్స్ ఫాలోవర్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

తాజాగా ఒక కొత్త ప్రదేశం ను వీరిద్దరు సందర్శించారు. ఆ సమయంలో శ్రియ భర్త ఆండ్రూ కాఫీ తెచ్చి ఇవ్వడం.. కాఫీ ఒక సిప్ టేస్ట్ చేసి ప్రేమగా భర్త పెదవుల ముద్దు పెట్టడం ను ఆ వీడియోలో చూడవచ్చు. రోడ్డు మీదే ఇలా దుకాణం పెట్టారని కొందరి విమర్శలు కూడా తప్పడం లేదు. ఇక ఇద్దరు ఎంత అన్యోన్యంగా.. సంతోషంగా వారి వైవాహిక జీవితం ను గడుపుతున్నారో అనే విషయం తెలుసుకునేందుకు ఇటీవల వారు షేర్ చేసిన వీడియోలు ఫోటోలు సాక్ష్యం.

ఇక శ్రియ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కీలకమైన గెస్ట్ రోల్ లో శ్రియ కనిపించిన విషయం తెల్సిందే. మరో వైపు హిందీ లో కూడా ఒక సినిమా ను చేయబోతుంది. ఇటీవల ఈమె నటించిన గమనం సినిమా కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అందులో చెవులు వినిపించని ఒక తల్లి పాత్రలో ఆమె కనిపించింది. భవిష్యత్తులో మరిన్ని విలక్షణ పాత్రలు చేసేందుకు సిద్ధం అన్నట్లుగా ఈ అమ్మడు చెబుతోంది.