ఆ నడుము మడతల్లోనే దాగి ఉంది సంథింగ్

Sat Dec 03 2022 10:00:01 GMT+0530 (India Standard Time)

Video Pooja in red saree

అందం అంతా ఆ నడుము మడతల్లోనే దాగి ఉంది. అలా వేదికపైకి వెళుతూ ఒక్క లుక్కిచ్చి గుండె గిల్లేసింది బుట్ట బొమ్మ. ఎర్ర చీర- కాంబినేషన్ రవికెలో ఒంపుసొంపుల వయ్యారాల్ని వడ్డించింది. ఈవెంట్ లో కిల్లర్ లుక్ తో కట్టి పడేసింది. ముఖ్యంగా ఆ నడుము వొంపుల్ని ప్రదర్శిస్తూ అహూతుల కంటికి కునుకుపట్టనివ్వని ట్రీటిచ్చింది. ఇంతకీ ఇది ఏ వేదిక? అంటే వివరాల్లోకి వెళ్లాలి.తాజాగా ముంబైలో జరిగిన `సర్కస్`  ట్రైలర్ లాంచ్ వేడుకలో రణవీర్ సింగ్ - పూజా హెగ్డే జంట స్టైలిష్ ఎరుపు దుస్తులలో కనిపించారు. ఈ జంట వేదికపై చాలా ప్రత్యేకంగా కనిపించింది. ఇక పూజాతో పాటు మరో కథానాయిక జాక్విలిన్ ఫెర్నాండెజ్ కూడా రెడ్ డ్రెస్ కోడ్ ని మెయింటెయిన్ చేయడం ఇతర టీమ్ అంతా ఎరుపు దుస్తుల్లో ప్రత్యక్షం కావడంతో వేదిక ఆద్యంతం ఎరుపెక్కింది.

దానికి తగ్గట్టే సర్కస్ చిత్రానికి కావాల్సినంత పబ్లిసిటీ దక్కింది. ఈ డ్రెస్ కోడ్ సినిమా టైటిల్ కి కంటెంట్ కి తగ్గ థీమ్ తో డిజైన్ చేసినది. ఎప్పటిలానే సర్కస్ ఈవెంట్ ఆద్యంతం రణవీర్ ఎంతో ఎనర్జీతో ఉత్సాహంగా కనిపించగా .. పూజా హెగ్డే షో స్టాపర్ గా నిలిచింది. ఈ అమ్మడు అలా వేదికపైకి చీరలో నడిచి వస్తుంటే ఆ నడుము సొంపుల్లో వేదిక వద్ద కుర్రకారు కంటి పాపలు లాక్ అయిపోయాయి. పూజా రెడ్ హాట్ శారీలో చాలా స్పెషల్ గా కనిపించింది.

ఓవైపు రణవీర్ ఎర్రటి బ్లేజర్ మ్యాచింగ్ రెడ్ ప్యాంట్ తో సర్కస్ బోయ్ లా కనిపిస్తుంటే.. కవ్వించి కొల్లగొట్టే అందాల సుందరిగా పూజా కనిపిస్తోంది.   చూడటానికి సాధారణ రఫిల్డ్ చీరలో మ్యాచింగ్ బ్లౌజ్ తో ఆల్-రెడ్ లుక్ లో కనిపించినా పూజాలో ఏదో ప్రత్యేక ఆకర్షణ షో స్టాపర్ గా నిలిపింది.

ముఖ్యంగా పూజా టోన్డ్ బాడీ తన అందాన్ని మరింత ఇనుమడింప జేసిందంటే అతిశయోక్తి కాదు. ఎంపిక చేసుకున్న మినిమల్ ఆభరణాలు.. సహజ సిద్ధమైన అలంకరణ .. జుట్టీలతో మోడిష్- సిల్హౌట్ లుక్ తో బుట్టబొమ్మ ఎంతో అందంగా కనిపించింది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా ఎరుపు రంగు దుస్తులలో ట్రైలర్ లాంచ్ లో ఆకట్టుకుంది. ఈ వేదికపై ఉన్న స్టార్లలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పూజాకు ఉన్న ప్రత్యేక క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. తదుపరి మహేష్ సరసన త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ బ్యూటీ నటించనుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.