వీడియో : లెహరాయికి హాట్ పూజా క్యూట్ స్టెప్స్

Wed Nov 24 2021 10:19:32 GMT+0530 (IST)

Video Pooja Cute Steps To Leharai

స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తన ఫొటోలను షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు ఇన్ స్టా లో షేర్ చేసిన సోర్టీ వైరల్ అవుతోంది. లెహరాయి పాటకు క్యూట్ గా స్టెప్పులు వేస్తూ ఉంది. ఏదో షూట్ లేదా కార్యక్రమానికి రెడీ అవుతున్న పూజా హెగ్డే లెహరాయి పాట పెట్టుకుని సరదాగా స్టెప్పులు వేస్తున్న వీడియో ను షేర్ చేసింది. పూజా హెగ్డే షేర్ చేసిన ఈ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పూజా హెగ్డే వీడియో లేదా ఫొటో ఏం షేర్ చేసినా కూడా నెట్టింట రెగ్యులర్ గా వైరల్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో ట్రెండ్ అవుతోంది.పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన రాధే శ్యామ్ సినిమా మొదలుకుని వరుసగా వచ్చే ఏడాది బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా తమిళంలో ఈమె నటించిన మొదటి సినిమా మరియు బాలీవుడ్ లో ఈమె నటిస్తున్న సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో తరుచూ కనిపిస్తూనే ఉంటుంది. ఇటీవల మాల్దీవులకు వెళ్లిన ఈ అమ్మడు అక్కడ బికినీ లో ఫొటో షూట్ తో పాటు అక్కడ అందాలను తన అందాలతో కలిపి చూపించి కన్నుల వింధు చేసిన విషయం తెల్సిందే.

అల వైకుంఠపురం సినిమా తర్వాత ఈ అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగింది. ఇక ప్రభాస్ రాధే శ్యామ్ పాన్ ఇండియా రేంజ్ లో భారీ ఎత్తున విడుదల అవ్వబోతుంది. ఆ సినిమాలో ప్రభాస్ కు జోడీగా ఈమె నటించిన విషయం తెల్సిందే. రాధే శ్యామ్ తర్వాత ఈ అమ్మడి క్రేజ్ బాలీవుడ్ లో మరింతగా పెరగడం ఖాయం అంటున్నారు. ప్రస్తుతం మూడు భాషల్లో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్ గా పూజా హెగ్డే నిలిచింది. అందంతో పాటు మంచి నటన ప్రతిభ ఇంకా డాన్స్ లో ప్రావిణ్యం ఉండటంతో స్టార్స్ కు జోడీగా ఈ అమ్మడికి అవకాశాలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఈమెను జనాలు భారీ ఎత్తున ఫాలో అవుతున్నారు.