వీడియో: నిధి అగర్వాల్ ఇస్మార్ట్ ధమాకా ట్రీట్

Wed Apr 21 2021 20:06:03 GMT+0530 (IST)

Video: Nidhi Agarwal Ismart Dhamaka Treat

ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో రామ్ సరసన నటించిన నిధి అగర్వాల్ కి ఆ తర్వాత ఆశించినంత పెద్ద ఆఫర్లు ఏవీ దక్కలేదు. బ్లాక్ బస్టర్ విజయం తన కంటే సాటి కథానాయిక నభాకే ఎక్కువ కలిసొచ్చింది. ఇటీవలే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న హిస్టారికల్ మూవీ హరి హర వీరమల్లులో నిధి ఆఫర్ దక్కించుకుందని ప్రచారం సాగుతున్నా.. దానికి సంబంధించిన అధికారిక కన్ఫర్మేషన్ లేదు.తమిళంలో సెల్వరాఘవన్ శిష్యుడు మాఘిజ్ తిరుమేని దర్శకత్వంలో నిధి ఓ సినిమా చేస్తోంది.  బాలీవుడ్ రీఎంట్రీ పైనా ప్రస్తుతం గురి పెట్టిందని సమాచారం. ఆ క్రమంలోనే ఈ భామ ఇన్ స్టా వేదికగా వరుస ఫోటోషూట్లతో విరుచుకుపడుతోంది.

తాజాగా మరో ఇస్మార్ట్ ఫోటోషూట్ ని ఇన్ స్టాలో షేర్ చేసింది. ఇది రకరకాల సందర్భాల్లో ఫోటోషూట్లకు సంబంధించిన మాషప్ మిక్స్ డ్ వీడియో. నిధి ప్రతిసారీ ఫోటోగ్రాఫర్లకు సహకరిస్తూ కిల్లర్ లుక్స్ తో ఫోజులిస్తున్న తీరు ఈ వీడియోలో ఆసక్తిని కలిగిస్తోంది. కథానాయికల ఫోటోషూట్లు అంత ఆషామాషీ ఏం కాదు. లోతుగా వెళితే ఇందులో బోలెడంత సైన్స్ ఉంటుందని ఈ ఫోటోషూట్ మాషప్ వీడియో చూస్తే అర్థమవుతోంది. స్టిల్ ఫోటోగ్రాఫర్ అడిగిన భంగిమ కోసం ఎక్స్ ప్రెషన్ కోసం చాలానే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ వీడియో అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది.