వీడియో: జాన్వీ- సారా డబుల్ బొనాంజా ట్రీట్

Wed Apr 21 2021 09:20:01 GMT+0530 (IST)

Video: Janhvi- Sarah Double Bonanza Treat

బాలీవుడ్ లో నెపోటిజం నిరంతరం వేడెక్కించే టాపిక్. నటవారసురాళ్ల హవాపై కుళ్లుకునే ఒక సెక్షన్ ఎప్పుడూ విమర్శలకు పాల్పడుతోంది. అయితే ఇదేదీ కేర్ చేయని ఈ భామలు తమ పని తాము చేసుకుపోతున్నారు. కరణ్ జోహార్ అండ్ కో నటవారసులతో వరుసగా సినిమాలు తీస్తూనే ఉన్నారు.ఇదంతా ఒకెత్తు అనుకుంటే నటవారసురాళ్ల స్నేహం కలిసి పని చేయడం అనేవి ఇంకో ఎత్తు. కలిసే జిమ్ చేస్తారు. కలిసే యోగా సెషన్స్ కి వెళతారు. కలిసి ఒకే కోచ్ ని షేర్ చేస్కుంటారు. ఇదిగో ఇక్కడ నటవారసురాళ్లు జాన్వీ కపూర్ - సారా అలీఖాన్ యోగా జిమ్ మిక్స్ డ్ క్లాస్ చూస్తున్నారు కదా!

ఈ ఇద్దరూ బాలీవుడ్ లో గ్యాప్ అన్నదే లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళుతున్న కథానాయికలు. ఇద్దరూ 2018 లో అరంగేట్రం చేసి ఘనమైన ఆరంగేట్రాన్ని చాటుకున్నారు. సినీసోదరభావంలో మంచి సత్సంబంధాల్ని కలిగి ఉన్నారు. ప్రస్తుతం ఆ ఇద్దరూ గోవాలో కలిసి సరదాగా గడుపుతున్నారు. సారా అలీ ఖాన్ ఇన్ స్టాగ్రామ్ లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఇందులో జాన్వి కపూర్ కూడా తనతో ఉన్నారు. బంగారు ఛాయను పొందడానికి ఆ ఇద్దరూ ప్రయోగాత్మక వ్యాయామ సెషన్ కి సిద్ధమయ్యారు.

``ప్రవాహంతో వెళ్ళండి. స్థిరంగా నెమ్మదిగా .. కిక్ హై-స్క్వాట్ సాధ్యం. ఇలా చేస్తే మీకు బంగారు ఛాయ లభిస్తుంది`` అంటూ టీజ్ చేశారు సార. ఈ వీడియోకి జస్టిన్ బీబర్స్ పీచ్స్ నేపథ్యంలో వినిపిస్తోంది.  జాన్వి - సారా కలిసి వర్కవుట్ ని చేస్తుండగా ఆ పక్కనే కోచ్ కనిపిస్తున్నారు. లెగ్ రైజెస్.. లంజస్.. పుషప్స్.. స్క్వాట్స్ లాంటి టెక్నిక్స్ ని ఈ వీడియోలో ప్రదర్శించారు. వర్కవుట్ సెషన్ ను పర్యవేక్షించిన సారా ఫిట్ నెస్ ట్రైనర్ నమ్రతా పురోహిత్ ని ఈ వీడియోలో చూడొచ్చు.

కెరీర్ మ్యాటర్ కి వస్తే జాన్వీ కపూర్ గుడ్ లక్ జెర్రీ.. దోస్తానా 2 వంటి చిత్రాల్లో నిస్తున్నారు. కరణ్ జోహార్ తఖ్త్ పెండింగులో ఉంది.  సారా తదుపరి `అట్రాంగి రే`లో ధనుష్ - అక్షయ్ లాంటి స్టార్ల సరసన కనిపించనుంది.