Begin typing your search above and press return to search.

వీడియోః కలర్‌ ఫుల్‌ వేడుకలో బిగ్‌ బి.. నాగ్‌.. రెజీనా

By:  Tupaki Desk   |   18 April 2021 5:30 AM GMT
వీడియోః కలర్‌ ఫుల్‌ వేడుకలో బిగ్‌ బి.. నాగ్‌.. రెజీనా
X
టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున మరియు బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబచ్చన్ లు కళ్యాణ్‌ జ్యువెలర్స్ కు పర్మినెంట్‌ బ్రాండ్ అంబాసిడర్స్ అనే విషయం తెల్సిందే. వీరిద్దరు కలిసి ఇప్పటికే పలు సార్లు కళ్యాణ్‌ జ్యువెలర్స్ కోసం కమర్షియల్‌ యాడ్ లో నటించడం జరిగింది. తాజాగా మరోసారి కళ్యాణ్ వారి యాడ్‌ కోసం కలిసి నటించారు. ఈసారి యాడ్‌ చాలా కలర్ ఫుల్ గా ఉంది. ఒక పెళ్లి వేడుక ను యాడ్‌ కోసం క్రియేట్‌ చేయడం జరిగింది. భారీ బడ్జెట్‌ సినిమాలో పెళ్లి వేడుక ఎంత రిచ్‌ గా ఉంటుందో బిగ్ షాట్స్ పెళ్లి వేడుక ఎలా ఉంటుందో అలా ఈ యాడ్‌ కోసం పెళ్లి వేడుకను నిర్వహించారు. అద్బుతమైన కలర్‌ ఫుల్‌ సెట్‌ లో ఈ యాడ్‌ ను షూట్‌ చేయడం జరిగింది.

నాగార్జున కు చెల్లిగా రెజీనా కనిపించింది. అమితాబచ్చన్‌.. జయబాధురి ల తనయుడతో రెజీనా పెళ్లిగా యాడ్‌ లో చూపించారు. యాడ్‌ లో కళ్యాణ్‌ జ్యువెలర్స్ మెరిసింది. పెళ్లి చేసి అత్తవారింటికి పంపినా కూడా కళ్యాణ్‌ వారి జ్యువెలర్స్ పెట్టుకుంటే ఆనందంగా జీవితం మారుతుంది అంటూ ఈ యాడ్‌ లో చూపించే ప్రయత్నం చేశారు. యాడ్‌ కాన్సెప్ట్ ను పక్కన పెడితే చాలా కలర్‌ ఫుల్‌ గా యాడ్‌ ను చిత్రీకరించారు. ఇక ఈ యాడ్‌ కు గాను శంకర్‌ మహదేవన్‌ సంగీతాన్ని అందించాడు. శ్వేత మోహన్‌ తో కలిసి శంకర్ మహదేవన్ ఈ యాడ్‌ కోసం గొంతు విప్పాడు.

కలర్‌ ఫుల్‌ అండ్ హార్ట్‌ టచ్చింగ్ గా ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. నాగార్జున మరియు రెజీనాలు షేర్‌ చేశారు. కళ్యాణ్‌ జ్యువెలర్స్ యాడ్‌ కోసం కలిసి నటిస్తున్న నాగార్జున మరియు అమితాబచ్చన్‌ లు సినిమాలో ఎప్పుడు కలిసి నటిస్తారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీరిద్దరి కాంబో బ్రహ్మాస్త్ర సినిమా తో రాబోతుంది. కరోనా కారనంగా ఆలస్యం అవుతున్న బ్రహ్మాస్త్ర మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.