Begin typing your search above and press return to search.

చ‌ర‌ణ్ లేదా అల్లూతో విక్ట‌రీ వెంక‌టేష్?

By:  Tupaki Desk   |   5 Dec 2021 10:30 AM GMT
చ‌ర‌ణ్ లేదా అల్లూతో విక్ట‌రీ వెంక‌టేష్?
X
`నార‌ప్ప‌`..`దృశ్యం-2` చిత్రాల‌తో విక్ట‌రీ వెంక‌టేష్ బ్యాక్ టు బ్యాక్ స‌క్సెస్ లు అందుకున్న సంగ‌తి తెలిసిందే. రెండు సినిమాలు ఓటీటీలోనే రిలీజ్ అయి పెద్ద విజ‌యం సాధించాయి. థియేట‌ర్ల‌లో రిలీజ్ అయి ఉంటే ఆ రెండు సినిమాల‌కు ఇంకా మంచి పేరొచ్చేది. అయితే సేఫ్ సైడ్ గా నిర్మాత సురేష్ బాబు ఓటీటీకి వెళ్లిపోవ‌డంతో వాటికి అంత రీచ్ దొర‌క‌లేదు. ఇక వెంకీ ప్ర‌స్తుత లైన‌ప్ చూస్తే హీరోగా ఫుల్ బిజీగానే ఉన్నారు. అనీల్ రావిపూడి ద‌ర్శక‌త్వంలో `ఎఫ్-3` లో నటిస్తున్నారు. `ఎఫ్ -2` కి సీక్వెల్ గా తెర‌కెక్కుతోన్న కామెడీ చిత్రంపై భారీ అంచ‌నాలున్నాయి. అలాగే యంగ్ డైరెక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వెంకీ ఓ సినిమా చేయాల్సి ఉంది.

అయితే ఆ చిత్రాన్ని ఇప్పుడే లాంచ్ చేసే ఆలోచ‌న‌లో లేర‌ని తెలుస్తోంది. వ‌రుస‌గా విజ‌యాలు ద‌క్కుతోన్న త‌రుణంలో కొత్త ద‌ర్శ‌కుడితో రిస్క్ ఎందుక‌ని వెంకీ వెనుక‌డుగు వేస్తున్నారనేది ఓ గుసగుస‌. పైగా వెంకీ చేస్తోన్న రీమేక్ చిత్రాల‌న్ని ఇక్క‌డా మంచి స‌క్సెస్ అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి రీమేక్ చిత్రంతోనే ముందుకు రావాల‌ని వెంక‌టేష్ ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ అయిన డ్రైవింగ్ లైసెన్స్ రైట్స్ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ వ‌ద్ద ఉన్నాయి. మంచి స్టార్ తో రీమేక్ చేయాల‌ని చ‌ర‌ణ్ భావిస్తున్నారు. అయితే ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఆ రైట్స్ ని గీతా ఆర్స్ట్ కి ఇచ్చేయాల‌ని చూస్తున్నారుట‌.

అల్లు అర‌వింద్ అయితే ద‌గ్గ‌రుండి అన్ని ప‌నులు చేసుకుంటార‌ని ఆ బ్యాన‌ర్ తో టై అప్ అయి చేస్తే బాగుంటుంద‌ని భావిస్తున్నారుట‌. ఇందులో డ్రైవింగ్ లైసెన్స్ ఇన్ స్పెక్ట‌ర్ పాత్ర‌కి వెంక‌టేష్ అయితే స‌రిపోతార‌ని...రియ‌ల్ ఫీల్ తెచ్చే కంటెంట్ కి అత‌నైతేనే న్యాయం చేయ‌గ‌ల‌ని అర‌వింద్ స‌హా అంద‌రూ భావిస్తున్నార‌ట‌. అలాగే మ‌రో హీరో పాత్ర కూడా ఈ సినిమాలో ఉంది. ఇంకా దాని గురించి సీరియస్ ఆలోచ‌న చేయ‌లేదు. ప్ర‌స్తుతం వెంక‌టేష్ విశ్రాంతి లో ఉన్నారు. తదుప‌రి ఏ ప్రాజెక్ట్ తో ముందుకు వెళ‌తార‌న్న‌ది ఖ‌రారు కావాల్సి ఉంది.