Begin typing your search above and press return to search.

`యూరి` న‌టుడు సూప‌ర్ హీరోగా మారుతున్నాడా?

By:  Tupaki Desk   |   27 Oct 2020 11:50 AM GMT
`యూరి` న‌టుడు సూప‌ర్ హీరోగా మారుతున్నాడా?
X
ఇండియ‌న్ స్క్రీన్ పై సూప‌ర్ హీరోలు అంత‌కంత‌కు పెరుగుతున్నారు. మార్వెల్.. డిసి యూనివ‌ర్శ్ `సూప‌ర్ హీరో` సినిమాల‌ రేంజు అనుభవాన్ని అందించడానికి యూరి ఫేం విక్కీ కౌషల్ స‌రికొత్త ట్ర‌య‌ల్ వేస్తుండ‌డం స‌ర్వ‌త్రా ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. విక్కీ కౌశ‌ల్ ప్ర‌స్తుతం ఓ సూపర్ హీరో చిత్రంలో న‌టించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. `యూరి: ది సర్జికల్ స్ట్రైక్` డైరెక్టర్ ఆదిత్య ధ‌ర్ ‌తో కలిసి విక్కీ ఈ కొత్త ప్రాజెక్ట్ కోసం ప‌ని చేస్తున్నాడు.

ఇప్ప‌టికే ఈ సూప‌ర్ హీరో సినిమాకి `అశ్వథ్థామ` అనే టైటిల్ ని నిర్ణ‌యించారు. ఇందులో విక్కీ ఇంతకు మునుపు ఎప్పుడూ చూడని అవతారంలో కనిపించ‌నున్నాడు. అభిమానులకు హాలీవుడ్ సూప‌ర్ హీరో రేంజు అనుభవాన్ని అందించేందుకే ఈ ప్ర‌య‌త్నం. విక్కీ కౌషల్ సూపర్ హీరో రేంజు అంటూ దర్శకుడు ఆదిత్య ధార్ ప్రశంస‌లు కురిపించారు.

ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో ఆదిత్య ధ‌ర్ స్వ‌యంగా ఈ మూవీ గురించిన‌ వివరాలను వెల్ల‌డించారు.ప్ర‌స్తుతం విక్కీ కౌశ‌ల్ స్వీయ‌నిర్భంధంలో ఉన్నారు. కోవిడ్ 19 మహమ్మారి వ‌ల్ల‌ ఇంట్లోనే ఉంటూ అభిమానులకు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన నిర్బంధానికి సంబంధించిన అప్ డేట్స్ ఇస్తున్నారు.

త‌దుప‌రి న‌టించ‌నున్న‌ స్క్రిప్ట్ లపైనా విక్కీ దృష్టి పెట్టాడు. విక్కీ అభిమానులు కూడా అతన్ని యాక్షన్ అవతారంలో చూడటానికి ఉత్సాహంగా ఉన్నారు. ఇప్ప‌టికే స్క్రిప్ట్‌ను పునః సమీక్షించాడని మునుపటి తో పోల్చితే గొప్ప డ్రాఫ్ట్ ను ద‌ర్శ‌కుడు సిద్ధం చేశాడని ఆదిత్యా ధ‌ర్ వెల్లడించారు.

ఇప్ప‌టికే వివిధ శాఖ‌ల టెక్నీషియ‌న్ల‌ను ఖరారు చేసారు. సూపర్ హీరో మూవీ రేంజుకు అవసరమైన విఎఫ్‌.క్స్ డిజైన్ ని రెడీ చేస్తున్నార‌ట‌. కథ వీడియో నాణ్యతను మార్వెల్ డిసి విశ్వంతో సరిపోల్చాలని తాను కోరుకుంటున్నానని పేర్కొన్నాడు. అతను రియల్ లొకేషన్లలో చిత్రీకరించిన యురి మాదిరిగానే అశ్వథ్థామ కోసం పనిచేయాలనుకుంటున్నార‌ట‌.