Begin typing your search above and press return to search.

వెట‌ర‌న్ న‌టికి దాదా సాహెబ్ ఫాల్కే పుర‌స్కారం

By:  Tupaki Desk   |   27 Sep 2022 3:46 PM GMT
వెట‌ర‌న్ న‌టికి దాదా సాహెబ్ ఫాల్కే పుర‌స్కారం
X
భారతీయ సినీప‌రిశ్ర‌మ‌ల్లో `దాదా సాహెబ్ ఫాల్కే` అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు. ఈ రోజు భారత ప్రభుత్వం అధికారికంగా వీటిని ప్రకటించింది. 2020 సంవత్సరానికి బాలీవుడ్ నటి ఆశా పరేఖ్ పేరును జూరీ ఎంపిక చేసింది. భారతీయ సినిమాకి ఆమె చేసిన శ్రేష్ఠమైన కృషికి ఈ గౌరవప్రదమైన అవార్డుతో సత్కరించనున్నారు.

తాజా వివ‌రాల ప్ర‌కారం.. సెప్టెంబర్ 30న విజ్ఞాన్ భవన్ లో జరిగే 68వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమంలో గౌరవ రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డును స‌ద‌రు సీనియ‌ర్ న‌టీమ‌ణికి అందజేయనున్నారు.

నటి ఆశా పరేఖ్ 1942లో గుజరాత్ లో జన్మించారు. ఆమె చిన్నతనం నుండి శాస్త్రీయ నృత్యకారిణి. దీంతో కాల‌క్ర‌మంలో సినిమాలపై ఉత్సుకత పెరిగి ఆ తర్వాత బాలీవుడ్ లో రంగ ప్ర‌వేశం చేసారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ ప్రయాణం ప్రారంభించి తర్వాత దాదాపు 95 సినిమాల్లో నటించారు.

దిల్ దేకే దేఖో- కటి పతంగ్- కారవాన్- తివారి మంజిల్ త‌న కెరీర్ బెస్ట్ సినిమాలు గా నిలిచాయి. 1992లో ఆశాను పద్మశ్రీ అవార్డు వరించింది. ఆశా పరేఖ్ దర్శకురాలు .. నిర్మాత కూడా. 1998-2001 మధ్య సెన్సార్ బోర్డు అధిపతిగా కూడా పనిచేశారు.

దాదాసాహెబ్ ఫాల్కే సెలక్షన్ జ్యూరీ స‌భ్యులు.. శ్రీమతి ఆశా పరేఖ్ జీ భారతీయ సినిమాకు చేసిన ఆదర్శప్రాయమైన జీవితకాల సేవను.. స‌హకారాన్ని గుర్తించి ఫాల్కే అవార్డు ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రకటించడం మాకు ద‌క్కిన‌ గౌరవంగా భావిస్తున్నామ‌ని తెలిపారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును గౌరవనీయ భారత రాష్ట్రపతి విజ్ఞాన్ భవన్ లో ప్రదానం చేస్తారు

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.