నటి వాణిశ్రీ కుమారుడి మరణంలో కొత్త ట్విస్ట్..!

Sat May 23 2020 15:06:48 GMT+0530 (IST)

Veteran actress Vanisri son dies

సీనియర్ నటి వాణిశ్రీ నివాసంలో విషాదం చోటుచేసుకుంది. వాణిశ్రీ కుమారుడు అభినయ్ వెంకటేష్ కార్తీక్ (36) మరణించాడు. అభినయ్ వెంకటేష్ గుండె పోటుతో మరణించారంటూ ఉదయం నుండి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వెంకటేష్ గుండె పోటు కారణంగా ఆయన మరణించలేదని.. ఆత్మహత్యకు పాల్పడి మరణించాడనే న్యూస్ బయటికి వచ్చింది. తన తనయుడితో కాలక్షేపం చేసిన అభినయ్ శుక్రవారం చెంగల్ పట్టు జిల్లా తిరుక్కళుకుండ్రంలోని ఫాంహౌస్ లో ఆయన ఆత్మహత్య చేసుకున్న విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. అభియన్ చెన్నై లోని అన్నపూర్ణ మెడికల్ కాలేజీలో మెడిసిన్ పూర్తిచేశాడు. బెంగళూరులోని ప్రభుత్వ ఆస్పత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న అభినయ్ బెంగళూరు నుంచి వచ్చాక ఇంటికే మరిమితమయ్యారు. అయితే ఆయన అనూహ్యంగా నిన్న బలవన్మరణానికి పాల్పడ్డారు.మరోవైపు అభినయ్ మృతిపై తిరుక్కళుకుండ్రం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. హోం క్వారంటైన్ లో ఉన్న ఆయన తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగానే ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. కాగా వాణిశ్రీకి కుమారుడు అభినయ్ వెంకటేష్ తో పాటు కుమార్తె అనుపమ ఉన్నారు. కుమారుడు హఠాన్మరణంతో వాణిశ్రీకి పలువురు టాలీవుడ్ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అభినయ వెంకటేష్ మృత దేహాన్ని వాణిశ్రీ ఇంటికి తీసుకొచ్చారు. దీంతో చెన్నైలో వున్న సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా వాణీశ్రీ ఇంటికి చేరుకుంటున్నారు. అభినయ వెంకటేష్ మృతిపై ఆరా తీస్తున్నారు. అభియన్ కు భార్య ఓ కుమారుడు (4) మరియు 8 నెలల కూతురు ఉన్నారు. ఆయన భార్య కూడా వైద్యురాలే. వీరంతా ప్రస్తుతం చెన్నైలోనే నివాసం ఉంటున్నారు.