సొంత బయోపిక్ కు రెడీ అయిన సీనియర్ స్టార్

Tue Jul 07 2020 13:20:21 GMT+0530 (IST)

Veteran actor Karthik is busy writing his autobiography?

ఈ మధ్య కాలంలో బయోపిక్స్ ఎక్కువ అయ్యాయి. అన్ని భాషల్లో కూడా వరుసగా బయోపిక్స్ వస్తున్నాయి. ఇప్పుడు సినీ ప్రముఖులు రాజకీయ నాయకులతో పాటు క్రీడాకారుల బయోపిక్స్ కూడా రూపొందుతున్నాయి. ఈ క్రమంలోనే తమిళ స్టార్ కార్తీక్ బయోపిక్ కూడా ప్రేక్షకుల ముందుకు రాబుతోంది. ప్రస్తుతం తన బయోగ్రఫీ ని తానే స్వయంగా కార్తీక్ రాస్తున్నాడట.1980 కాలంలో హీరోగా తమిళం ఇంకా తెలుగు ప్రేక్షకులను అలరించిన కార్తీక్ ఉన్నట్లుండి వెండి తెరకు దూరం అయ్యాడు. సినిమాలు చేయడం మానేసిన కార్తీక్ ఇటీవల మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నాడు. ఆయన అభిమానులు ఇప్పటికి ఆయన సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు.

ఇలాంటి సమయంలో బయోపిక్ ను ప్రకటించడం తో అంతా కూడా ఇప్పటి నుండే ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. తన పాత్రను పోషించే అవకాశం కార్తీక్ ఎవరికి ఇస్తాడు సినిమా ఇతర విషయాలను త్వరలో వెల్లడి చేసే అవకాశం ఉంది.