ఈ తమిళ నేటివిటీ మనకు సూట్ అవుతుందా?

Wed Oct 16 2019 14:12:41 GMT+0530 (IST)

తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో 'బిగిల్' అనే సినిమాలో నటిస్తున్నారు.  ఈ సినిమాను తెలుగులో 'విజిల్' పేరుతో రిలీజ్ చేస్తున్నారు.  రీసెంట్ గా ఈ సినిమా నుండి  'వెర్రెక్కిద్దాం' అనే లిరికల్ సాంగ్ విడుదల చేశారు.  ఈ సినిమాకు ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నాడనే సంగతి తెలిసిందే. 'వెర్రెక్కిద్దాం' పాటకు సాహిత్యం అందించినవారు రాకేందుమౌళి. ఈ పాటను పాడినవారు రేవంత్. లిరిక్స్ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.  తమిళ పాటకు ఫిల్లింగ్ గా ఏదో పదాలతో పని కానిచ్చినట్టు ఉంది.  ఇక ట్యూన్ విషయానికి వస్తే గుప్పుగుప్పున తమిళ నేటివిటీ వాసన కొడుతోంది. ఏ కోశానా ఇది తెలుగు పాటలా అనిపించడంలేదు. ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు మంచి ప్రామిసింగ్ సినిమాలాగా కనిపించింది కానీ ఈ పాట చూస్తే మాత్రం సినిమా తెలుగు వెర్షన్ ఎంతమాత్రం ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందనే విషయంలో అనుమానాలు వస్తున్నాయి.

ఈమధ్య తమిళ డబ్బింగ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర వరసగా నిరాశపరుస్తున్నాయి. మరి ఇలాంటి తమిళ నేటివిటి ఉన్న సినిమాలపై తెలుగు బయ్యర్లు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం.. రిలీజ్ తర్వాత ప్రేక్షకులకు సినిమా కనెక్ట్ కాకపోతే తలలు పట్టుకోవాల్సిన అవసరం ఏముందో ఆలోచించుకోవాలి.  అసలు ఇలాంటి తమిళ నేటివిటీ మనకు సూట్ అవుతుందా అనేది ప్రశ్న.