చై-సామ్ విడాకులపై వర్మ కామెంట్

Tue Dec 07 2021 15:06:39 GMT+0530 (IST)

Verma Comments On Chy Sam Divorce

సంచలనాల రాంగోపాల్ వర్మ ఎలాంటి అంశంపైనైనా అవలీలగా మాట్లాడగల సత్తా ఉన్న దర్శకుడు. మర్డర్లపై విశ్లేషణ చేయగలరు. రాజకీయాల గురించి తనదైన మార్క్ పంచ్ లు వేయగలరు. మహిళా సంఘాల్ని ఉద్దేశిస్తూ కౌంటర్లు వేస్తారు. అవసరాన్ని బట్టి హీరోల వ్యక్తిగత విషయాల్లో తలదూర్చగలరు. ఇంకా అవసరం అనుకుంటే శ్రీరెడ్డి లాంటి వాళ్లను సీన్ లోకి తీసుకొచ్చి తిట్టించగల నేర్పరి అని ఇప్పటికే ప్రూవ్ అయింది. వర్మలో ఉన్న ఈ ట్యాలెంటే ఆయన్ని వాస్తవ కథలవైపు ప్రేరేపిస్తుంటాయి.నిజ జీవిత కథలకు దృశ్యరూపం ఇవ్వడానికి వర్మ ఎప్పుడూ ఆసక్తిగా ఉంటారు. ఇక వర్మ తన భార్యతో విడాకుల గురించి మీడియాలో చాలా సందర్భాల్లో మాట్లాడారు. భార్య..పిల్లలు వంటి సెంటిమెంట్లకు దూరంగా ఉంటానని..పెళ్లి గురించి పూర్తి అవగాహన లేకనే అప్పట్లో పెళ్లి చేసుకున్నట్లు..అందుకు ఎంతో బాధపడినట్లు చాలా సందర్భాల్లో తెలిపారు. అలాంటి రామ్ గోపాల్ వర్మని నాగచైతన్య-సమంత విడాకుల గురించి ప్రశ్నిస్తే కచ్చితంగా స్పందిస్తారనుకుంటా. కానీ వర్మ మాత్రం తన ముందుకు ఇదే ప్రశ్న వేస్తే.. వేరే వాళ్ల వ్యక్తిగత జీవితాల గురించి ఎలాంటి కామెంట్ చేయనని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. చై విషయంపై స్పందించడానికి వర్మ అనాసక్తిని చూపించారు. నేను వేరేవాళ్ల పర్సనల్ మ్యాటర్స్ పై కామెంట్ చేయను అని వర్మ అన్నారు. చై -సామ్ జంట విడాకులపై అభిప్రాయం చెప్పేందుకు ఇష్టపడలేదు.

నిజానికి వర్మ గతంలోనూ ఏ హీరో విడాకుల విషయంలోనూ తలదూర్చలేదు. స్టార్ హీరో పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి మాట్లాడారు తప్ప..ఆయన చేసుకున్న మూడు పెళ్లిలపై ఏ రోజూ కామెంట్ చేయలేదు. వర్మ రాసిన ఓ పుస్తకం సహా తీసిన సినిమాలో పవన్ పొలిటికల్ అంశంపై సెటైరికల్ గా స్పందించారు తప్ప సినిమాలో ఎక్కడా పెళ్లిళ్ల ప్రస్తావన..విడాకుల గురించి చెప్పిందే లేదు.