మీట్ Mr. పరిమళ.. ది స్మార్ట్ & హ్యాండ్ సమ్ బాయ్!

Thu Jul 11 2019 19:22:59 GMT+0530 (IST)

నిన్న ఇండియా Vs న్యూజీలాండ్ మ్యాచ్. వరల్డ్ కప్ లో ఫస్ట్ సెమి ఫైనల్ మ్యాచ్.  వర్షం కారణంగా ముందు రోజు ఆగిన మ్యాచ్ ను రిజర్వ్ డే నాడు కంటిన్యూ చేశారు.  అందరూ టీవీల ముందే కూర్చున్నారు. కానీ అనూహ్యంగా ఇండియా మ్యాచ్ ఓడిపోయింది.  ఈ మ్యాచ్ ఓడినందుకు భారతదేశంలోని క్రికెట్ ప్రేమికులు అందరూ బాధపడ్డారు. ఇప్పటికీ కొంతమంది ఆ బాధలో నుంచి బైటకు వచ్చి ఉండరు.  ఈ మ్యాచ్ రిజల్ట్ దెబ్బకు మన టాలీవుడ్ హీరో నితిన్ కూడా బాధ పడ్డాడట.  అయితే ఈరోజు మాత్రం ఆనందంగా ఉన్నాడట.ఈ విషయాన్ని నితిన్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలపాడు.   వెన్నెల కిషోర్ ఫోటో ను పోస్ట్ చేసి "నిన్న మ్యాచ్ ఓడిపోయినందుకు బాధలో ఉన్నాను.  ఇవాళ ది స్మార్ట్ అండ్ హ్యాండ్ సమ్ బాయ్ వెన్నెల కిషోర్ గారితో ఫస్ట్ టైమ్ నటిస్తున్నందుకు ఆనందంగా ఉన్నాను. #భీష్మ నుండి పరిమళ ను పరిచయం చేస్తున్నా" అంటూ ట్వీట్ చేశాడు.  అసలే వెన్నెల కిషోర్ భయ్యా మిస్టర్ వరల్డ్ టైపులో సూటు బూటు ధరించి ఒక సూపర్ డూపర్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చాడు.  పైగా పేరు 'పరిమళ' అంట.. కరెక్ట్ గా సెట్ అయింది.

కొందరు నెటిజన్లు దీనికి ఫన్నీ రియాక్షన్స్ ఇచ్చారు.  "ఓహో పరిమళా.. ఏంటమ్మా నీ చూపు ఇలా".. "పరిమళ గారు.. ఆల్ ది బెస్ట్".. "రివెంజ్ పరమ్ కంటే గొప్ప క్యారెక్టర్ ఆశిస్తున్నా" అంటూ రిప్లైస్ ఇచ్చారు.  లాస్ట్ రిప్లై లో రివెంజ్ పరమ్ తెలుసు కదా.. 'భీష్మ' దర్శకుడు వెంకీ కుడుముల మొదటి సినిమా 'ఛలో' లో వెన్నెల భయ్యా పాత్ర.  తన కామెడీతో రఫ్ఫాడించాడు. ఇప్పుడు పరిమళ పాత్రతో ఏం చేస్తాడో మనకు ఈ సినిమా రిలీజ్ అయితే కానీ తెలియదు.  ఏదైతేనేం.. పరిమళగారు మన నితిన్ మనసులోని ఇండియా ఓటమి బాధను మరిచిపోయేలా చేశారు..సంతోషం!