ఇన్సైడ్ టాక్: 'నారప్ప' లో హైలైట్ గా నిలవనున్న వెంకీ పెర్ఫార్మెన్స్..

Tue Jun 15 2021 20:26:01 GMT+0530 (IST)

Venky Performance Highlights In Narappa

విక్టరీ వెంకటేష్ - డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ''నారప్ప''. వి క్రియేషన్స్ మరియు సురేష్ ప్రొడక్షన్స్ పతాకాలపై కలైపులి ఎస్.థాను - సురేష్ బాబు కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం.. కొద్ది రోజుల్లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకోనుంది. సమ్మర్ కానుకగా ఈ సినిమాని విడుదల చేయాలని ప్లాన్ చేసుకోగా.. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో అన్ని సినిమాల మాదిరిగానే వాయిదా వేశారు.''నారప్ప'' చిత్రం తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన 'అసురన్' చిత్రానికి అఫిసియల్ రీమేక్ అనే సంగతి తెలిసిందే. ఈ సినిమా రెండు జాతీయ అవార్డులతో సహా పలు అవార్డులను గెలుచుకుంది. ఇందులో రా అండ్ రస్టిక్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన హీరో ధనుష్ కు బెస్ట్ యాక్టర్ గా రెండోసారి నేషనల్ అవార్డు తెచ్చిపెట్టింది. దీంతో ఇప్పుడు అందరి కళ్ళు 'నారప్ప' చిత్రంపై పడ్డాయి.

కథలో పెద్దగా మార్పులు చేయకుండా తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా 'నారప్ప' చిత్రాన్ని రూపొందిస్తున్నారని తెలుస్తోంది. వెంకటేష్ ఇప్పటికే అనేక చిత్రాలను రీమేక్ చేసి సూపర్ హిట్స్ కొట్టాడు. ఎలాంటి పాత్రలో అయినా అవలీలగా పరకాయ ప్రవేశం చేసి మెప్పించగలిగే వెంకీ.. ఇప్పుడు నారప్ప లో ఎలా నటించాడనే ఆసక్తి అందరిలో మొదలైంది.

ఇన్సైడ్ టాక్ ప్రకారం 'నారప్ప' సినిమా చాలా బాగా వచ్చిందని తెలుస్తోంది. ఇందులో ఇద్దరు పిల్లల తండ్రిగా.. మధ్య వయస్కుడి పాత్రలో వెంకటేష్ అద్భుతంగా నటించారని అంటున్నారు. వెంకీ నటన ఈ చిత్రానికి మేజర్ హైలైట్ గా నిలవనుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ లో వెంకటేష్ మేకోవర్ చూసి అందరూ షాక్ అయ్యారు. ఈ క్రమంలో వచ్చిన టీజర్ లో వన్ మ్యాన్ షోతో అదరగొట్టాడు.

ఈ చిత్రంలో నారప్ప భార్య సుందరమ్మ పాత్రలో హీరోయిన్ ప్రియమణి నటించింది. కొడుకు పాత్రలో 'కేరాఫ్ కంచరపాలెం' ఫేమ్ కార్తీక్ రత్నం నటించాడు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకి శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటర్ గా.. గాంధీ నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వెంకటేష్ - శ్రీకాంత్ అడ్డాల కాంబోలో వస్తున్న 'నారప్ప' చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి.