Begin typing your search above and press return to search.

కాస్త అతి అయ్యిందేమో కుడుములా?

By:  Tupaki Desk   |   21 Feb 2020 4:29 AM GMT
కాస్త అతి అయ్యిందేమో కుడుములా?
X
`ఛ‌లో` సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన వెంకీ కుడుముల‌ రెండవ ప్ర‌య‌త్నంగా `భీష్మ‌` చిత్రాన్ని తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. యూత్ స్టార్ నితిన్ హీరోగా.. క్రేజీ ర‌ష్మిక హీరోయిన్ గా న‌టించారు. వెంకీ లో మంచి రైట‌ర్ కం డైరెక్ట‌ర్ ఉన్నాడ‌ని తొలి సినిమాతోనే ప్రూవ్ అయ్యింది. `ఛ‌లో` హిట్టు అవ్వ‌డంతో నితిన్ మ‌రో ఆలోచ‌న లేకుండా వెంకీ వినిపించిన క‌థ‌ను లాక్ చేసి ప‌ట్టాలెక్కించాడు. ఆర్గానిగ్ ఫామింగ్ అనే థీమ్ కి వెంకీ క‌మ‌ర్శియ‌ల్ అంశాలు జొప్పించి తెర‌కెక్కించిన చిత్ర‌మ‌ది. ఈ శుక్ర‌వారం థియేటర్ల‌లోకి రిలీజైంది. ఇందులో నితిన్ కి ధీటుగా పోటీప‌డే పాత్ర‌కు అనంత్ నాగ్ అనే క‌న్న‌డ న‌టుడిని ఎంపిక చేశారు. అయితే ఆయ‌న రెండో సినిమా కిడ్ అయిన వెంకీకి అంగీక‌రించే క్ర‌మంలో చాలా మ్యాజిక్ జ‌రిగింద‌ట‌.

ఈ సంగ‌తిని వెంకీ కుడుముల ఓ ఇంట‌ర్వ్యూ లో వెల్ల‌డించారు. ద‌ర్శ‌కుడు వెంకీ మాట్లాడుతూ .. నితిన్ ది పెళ్లికాని ప్ర‌సాద్ లాంటి పాత్ర‌. భీష్మ అనే పేరు పెట్ట‌డం వ‌ల్ల అమ్మాయిలు ప్రేమించ‌డం లేద‌నే సందేహం తో ఉంటారు. కానీ మా హీరోలో మ‌రో యాంగిల్ కూడా ఉంటుంది. ఆ పాత్ర‌ను ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా మ‌లిచాం. ఈ క‌థ‌లో ఎలాంటి అడ్డంకులు లేకుండా నేరుగా పాయింట్ నే సినిమాలో చూపిస్తున్నా. ఉప‌న్యాసాలు గ‌ట్రా ఉండ‌వు. సందేశంతో కూడిన ఓ చ‌క్క‌ని సినిమా చూసిన అనుభూతి క‌లుగుతుంది.. అని తెలిపారు.

అలాగే ఇందు లో ఒక రాయ‌ల్ లుక్ ఉన్న క్యారెక్ట‌ర్ కోసం మంచి న‌టుడి తీసుకోవాల‌నుకుంటోన్న స‌మ‌యంలో ఓ క‌న్న‌డ సినిమా చూస్తున్న‌ప్పుడు అందులో న‌టించిన అనంత్ నాగ్ నా పాత్ర‌కు స‌రిగ్గా స‌రిపోతాడ‌నిపించింద‌న్నారు. ఆ త‌ర్వాత ఆయ‌న్ని కలిసి పాత్ర నేరెట్ చేసాను. ఆయన‌ వెంట‌నే ఒప్పుకున్నారు. అంత‌కు ముందు మ‌ణిర్న‌తం సినిమాలో న‌టించే ఛాన్స్ వ‌చ్చినా న‌టించ‌ లేదుట‌. అంత పెద్ద డైరెక్ట‌ర్ ని కాద‌ని నా క‌థ న‌చ్చ‌డంతో ఆయ‌న ఒకే చెప్ప‌డంతో నా స్క్రిప్టుపై ఇంకా న‌మ్మ‌కం క‌ల్గింద‌న్నాడు వెంకీ . అయితే మణిర‌త్నాని కాద‌ని.. వెంకీ కుడుములకు ఒకే చెప్ప‌డం.. ఆ విష‌యాన్ని వెంకీ మీడియా ముందు బ‌హిర్గ‌తం చేయ‌డం కాస్త అతిగానే అనిపిస్తోంద‌న్న విమ‌ర్శ అప్పుడే వైర‌ల్ అవుతుంది. మ‌రి అనంత్ నాగ్ పాత్ర ఏ మేర ఆక‌ట్టుకుంటుందో? మ‌రికొన్ని గంట‌ల్లో స‌మీక్ష‌కులే తేలుస్తారు.