రెండో సినిమా గండాన్ని గట్టెక్కేస్తాడా?

Thu Feb 20 2020 17:30:10 GMT+0530 (IST)

Venky Kudumula Life Depends on Bheeshma Movie Result

రెండో సినిమా అంటేనే దర్శకులకు టెన్షన్. చాలా మంది దర్శకుల కెరీర్ రెండో సినిమాతో చతికిలబడిన సందర్భాలున్నాయి. అందుకనే సెకండ్ మూవీ టెర్రర్ పై నిరంతరం దర్శకుల్లో చర్చ సాగుతూనే ఉంటుంది. రెండో సినిమాతో హిట్ అందుకుని సెంటిమెంటును బ్రేక్ చేసిన జాబితాలో పలువురి పేర్లు ఉన్నా.. ఆ జాబితాలో ఇటీవల చాలా పేర్లు చేరనే లేదు. దీంతో ఇప్పుడు భీష్మ చిత్రాన్ని రెండో ప్రయత్నంగా తెరకెక్కిస్తున్న వెంకీ కుడుమలపైనా ఆసక్తికర చర్చ సాగుతోంది.వెంకీ రెండో సినిమా గండాన్ని గట్టెక్కేస్తాడా? అంటూ అంతా ఆసక్తిగా వేచి చూస్తున్నారు. మొదటి సినిమా ఛలో ఆడేసింది. ఇప్పుడు రెండో సినిమా భీష్మ కూడా మొదటి సినిమాలా ఆడాల్సి ఉంటుంది. హిట్ టాక్ తెచ్చుకుంటనే తనకు భవిష్యత్ ఉంటుంది. లేకపోతే సెంటిమెంట్ పరిశ్రమలో అవకాశాలు రావడం చాలా కష్టం. ఆ ఘడియ కోసమే అతడు కూడా వెయిటింగ్. ఇప్పటికి టెన్షన్ టెన్షన్.

భీష్మకు రిలీజ్ ముందే మంచి హైప్ వచ్చింది. పోస్టర్లు ట్రైలర్ ఆకట్టుకున్నాయి. హీరో హీరోయిన్ ప్లస్ అన్న టాక్ వచ్చింది. రష్మిక గ్లామర్.. నితిన్ గ్రామర్ ప్రతిదీ యూత్ కి ఎక్కాయి. మరి హిట్టు కొట్టి తీరాల్సిందే. మంచి హీరో హీరోయిన్.. మంచి కథ అన్నీ కుదిరాయి. త్రివిక్రమ్ శిష్యుడు కాబట్టి వెంకీపై ఆడియెన్ కి నమ్మకం ఉంది. ఛలో రిలీజై రెండేళ్లయ్యింది.. ఇప్పటికి రెండో ప్రయత్నంతో వస్తున్నాడు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఈ శుక్రవారం భీష్మ భవిష్యత్ ఏమిటో ఆడియెన్ చెప్పేస్తారు. వెంకీ కుడుముల రెండో సినిమా సెంటిమెంటును బ్రేక్ చేస్తాడా లేదా? అన్నది కూడా తేలిపోనుంది.