Begin typing your search above and press return to search.

రామానాయుడు బ‌యోపిక్ పై వెంకీ ఏమన్నాడంటే..

By:  Tupaki Desk   |   25 May 2022 8:30 AM GMT
రామానాయుడు బ‌యోపిక్ పై వెంకీ ఏమన్నాడంటే..
X
విక్ట‌రీ వెంక‌టేష్ - మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ న‌టించిన `ఎఫ్ -3` మే 27న రిలీజ్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. దీంతో యూనిట్ కొద్ది రోజులుగా ప్ర‌చారంలో నిమ‌గ్న‌మైంది. దీనిలో భాగంగా వెంక‌టేష్ స‌హా..వ‌రుణ్ చురుకుగా ప్ర‌చారం ప‌నుల్లో పాల్గొంటున్నారు. ఈ సంద‌ర్భంగా వెంక‌టేష్ స్పెషల్ ఇట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర విశేషాలు పంచుకున్నారు. సినిమాతో పాటు..కుటుంబ విష‌యాల గురించి వెంకీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. ఆ వేంటో ఆయ‌న మాటల్లోనే తెలుసుకుందాం.

`ఎఫ్-3 సినిమా థియేట‌ర్లో చూస్తే ఆ కిక్ వేరుగా ఉంటుంది. పాత్ర‌ల నుంచి ప్రేక్ష‌కుడు ఎక్కువ ఫీల్ తీసుకుంటాడు. థియేట‌ర్ ఎక్స్ పీరియ‌న్స్ ఎప్పుడూ కొత్త‌గానే ఉంటుంది. థియేట‌ర్లో ఎప్పుడు సినిమా చూసిన అదోర‌క‌మైన ఆనందం క‌ల్గుతుంది. ఆ కిక్ ఓటీటీ ఇవ్వ‌లేదు. `నార‌ప్ప‌`..`దృశ్యం-2` చిత్రాలు త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో ఓటీటీ రిలీజ్ చేసాం.

`ఎఫ్ -3`లో పిసినారి పాత్ర పోషించాను. డ‌బ్బు జీవితంలో అవ‌స‌రం మాత్ర‌మే. జీవిత‌మే డబ్బు కాకూడ‌దు. సినిమాలో నా పాత్ర‌కు..నిజ జీవితానికి ఎలాంటి సంబంధం లేదు. రెండు వేరు వ‌రుగా చూడండి. ఇక బాక్సాఫీస్ క‌లెక్ష‌న్ల గురించి ప‌ట్లించుకోను. భారీ వ‌సూళ్లు సాధించే రేసులో నేను ఎప్పుడూ లేను. కానీ నిర్మాత‌కు మంచి లాభాలు రావాలి.

నా సినిమాలు రికార్డులు సృష్టించాయి. కానీ నాకు ఆ రికార్డుల‌పై న‌మ్మ‌కం లేదు. అయినా రికార్డులు ఏదో రోజు బ్రేక్ అవుతూనే ఉంటాయి. వాటి గురించి పెద్ద‌గా ఆలోచించ‌ను. సినిమా తీయ‌డం వ‌ర‌కే హీరో ప‌ని . ఆ త‌ర్వాత ఫ‌లితాలు ప్రేక్ష‌కుల మీద ఆధార‌ప‌డి ఉంటాయి. నేను నిర్మాత బిడ్డ‌ని . సినిమా బ‌డ్జెట్ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉంటాను.

అది నాన్న‌ని చూసి నేర్చుకున్నాను. అన‌వ‌స‌ర ఖ‌ర్చు అంటే న‌చ్చ‌దు. కానీ సినిమా ఆడ‌క‌పోతే అనేక ర‌కాల ఆలోచ‌న‌లు వెంటాడుతాయి` అని అన్నారు. అలాగే త‌న‌యుడు అర్జున్ ఎంట్రీ గురించి స్పందించారు. మా అబ్బాయి ఎంట్రీ విష‌యంలో ఇంకా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. ప్ర‌స్తుతం చ‌దువుకుంటున్నాడు.

అది పూర్త‌యిన త‌ర్వాత ఆలోచిస్తా. ఇప్పుడే అత‌నికి సినిమాలు చెప్పి డిస్ట‌ర్బ్ చేయాల‌నుకోవ‌డం లేదు. అలాగే మంచి బియోపిక్ లు చేయాల‌ని ఉంది. వివేకానందుడి బ‌యోపిక్ పై చాలా ఆస‌క్తిగా ఉన్నా. ఎవ‌రైనా నాన్న జీవితంపై గొప్ప‌గా క‌థ రాస్తే ఆ సినిమా గురించి ఆలోచిస్తాను`అని అన్నారు.

రామానాయుడు బ‌యోపిక్ కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. దేశంలో అన్ని భాష‌ల్లో సినిమాలు నిర్మించిన ఏకైకా నిర్మాత రామానాయుడు. ఎంతో మంది హీరోల్ని..ద‌ర్శ‌కుల్ని వెండి తెర‌కు ప‌రిచ‌యం చేసారు. ఎన్నో అవార్డు లు..రివార్డులు ఆయ‌న సొంతం.