వెంకీని అలా చూపిస్తే ఒప్పుకుంటారా?

Thu Sep 19 2019 07:00:01 GMT+0530 (IST)

Venkatesh on about his Role in Venky Mama Movie

ఎఫ్2తో ఈ ఏడాది ప్రారంభంలోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టి తన రేంజ్ ప్రూవ్ చేసుకున్న విక్టరీ వెంకటేష్ కొత్త మూవీ వెంకీ మామ షూటింగ్ ఫినిషింగ్ కు దగ్గరలో ఉంది. ముందు దసరా పండగకు రిలీజ్ అనుకున్నారు కానీ ఏవో అనివార్య కారణాల వల్ల వాయిదా వేశారు. పండక్కి అప్ డేట్ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. ఇకపోతే దీనికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్ డేట్ ఫ్యాన్స్ కు కొంత ఎమోషన్ ని అదే సమయంలో కొంత టెన్షన్ ని కలిగించడం సహజం.ఫిలిం నగర్ టాక్ ప్రకారం ఇందులో వెంకటేష్ పాత్రకు యాంటీ క్లైమాక్స్ డిజైన్ చేశారట. అంటే మిలిటరీలో పని చేసిన వెంకీ మామకు భావోద్వేగాలతో కూడిన బరువైన ముగింపు ఇచ్చారట. ఇంతవరకు వెంకటేష్ తన కెరీర్ లో ఎన్నడూ చివర్లో చనిపోయే పాత్ర చేయలేదు. మరి ఇప్పుడు చేస్తే అభిమానులు ఒప్పుకుంటారా అనేది అనుమానమే. పైగా వెంకీని అమితంగా ఇష్టపడే ఫ్యామిలీ ఆడియన్స్ కు ఇది రుచించకపోవచ్చు.

అందుకే రెండు రకాల ముగింపులు షూట్ చేసే ప్లాన్ లో దర్శకుడు బాబీ ఉన్నట్టుగా వినికిడి. సురేష్ బాబు తన టీం తో కూర్చుని రెండూ విశ్లేషించి తమ్ముడితో కలిసి ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయట. దీనికి సంబంధించిన క్లారిటీ రావడానికి కొంత టైం అయితే పడుతుంది. పాయల్ రాజ్ పుత్ రాశి ఖన్నా హీరొయిన్లు నటిస్తున్న ఈ మూవీలో నాగ చైతన్య మొదటిసారి మావయ్యతో కలిసి ఫుల్ లెంత్ రోల్ చేస్తుండటంతో అంచనాలు బాగా ఉన్నాయి