నెట్ ప్లిక్స్ కోసం వెంకీ ట్రాన్సపర్మేషన్ షాకింగ్!

Mon Sep 26 2022 14:02:42 GMT+0530 (India Standard Time)

Venkatesh Look From Rana Naidu

విక్టరీ వెంకటేష్ డిఫరెంట్ గెటప్స్ ట్రై చేయడం అన్నది చాలా రేర్. ఆయన మొత్తం కెరీర్ లో గెటప్ ఛేంజ్ జరిగింది చాలా తక్కువ సినిమాల్లోనే. వీలైనంత వరకూ ఆయన నేచురల్ గా ఉండే పాత్రల్నే ఎంపిక చేసుకుంటారు. తెరపై అంతే సహజంగా కనిపించడానికి ఇష్టపడతారు. వృత్తి పరంగా ఎంత డిగ్నిటీగా ఉంటారో?  వ్యక్తిగతంగాను వెంకీ అదే విధానాన్ని అనుసరిస్తారు.ఆయనకంటూ ఓ బ్రాండ్ ని క్రియేట్ చేసుకుని అదే విధానాన్ని కొనసాగించడం ఓ స్టైల్. అయితే ఇదంతా ఒకప్పటి మాట. నేటి విధానం మారిందంటూ వెంకీ సైతం ఓ వెబ్ సిరీస్ కోసం గెటప్ పరంగా భారీ మార్పులు చేసినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం అబ్బాయ్...బాబాయ్  రానా..వెంకటేష్ 'రానా నాయుడు' అనే ఓ వెబ్ సిరీస్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

 రానా ' రానా పాత్రని పోషిస్తుంటే..నాయుడి పాత్రని వెంకటేష్' పోషిస్తున్నారు. నెట్ ప్లిక్స్  సిరీస్ లో కి ఎంట్రీ ఇవ్వడం వెంకీ కి ఇదే తొలిసారి . ఈ సిరీస్ పై భారీ అంచనాలే ఉన్నాయి.

తప్పక విజయం  సాధిస్తుందని నెట్ ప్లిక్స్ ధీమా వ్యక్తం చేస్తుంది. తాజాగా వెంకు లుక్ ఒకటి నె ట్టింట వైరల్ అవుతోంది. అందులో వెంకటేష్ నెరిసిన జుట్టు..గెడ్డం..మీసంతో కనిపిస్తున్నారు.

మరో చేత్తో కాలర్ ఎగరవేస్తూ తనలో సీరియస్ నెస్ ని చూపిస్తున్నారు. లుక్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అయితే ఇలా కాలర్ ఎగరేయడం అన్నది వెంకీక కొత్తేం కాదు. ఆయన గత చిత్రాల్లోనూ ఇలాంటి స్టైల్ కనిపిస్తుంది. అయితే నెరిసిన జుట్టుతో కనిపించడం  ఇదే తొలిసారి.  ఆయన మునుపెన్నడలు ఇలాంటి ఆహార్యం ప్రయత్నించలేదు.

కోలీవుడ్ లో తల అజిత్.. రాజ శేఖర్  లాంటి నటులు కొన్ని సినిమాల్లో ఫాలో అయ్యారు. ఆ తర్వాత  ఇదొక యాక్షన్ త్రిల్లర్ సరీస్. ప్రముఖ అమెరికన్ షో రే డొనోవన్ కి రీమేక్ రూపం ఇది. అన్షుమాన్-సుపర్ణ్ వర్మ జంటగా దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీ  ‘అతి త్వరలో’ అని టీజర్ లో చూపించారు.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.