Begin typing your search above and press return to search.

వెంకీమామ 2020 ప్లాన్స్ లీక్

By:  Tupaki Desk   |   19 Dec 2019 1:30 AM GMT
వెంకీమామ 2020 ప్లాన్స్ లీక్
X
వెంక‌టేష్‌- నాగ‌చైత‌న్య‌ సంక్రాంతికి చాలా ముందే పండుగ‌ను తీసుకొచ్చారు. సినిమాకు డివైడ్ టాక్ వ‌చ్చినా.. ఓపెనింగుల ప‌రంగా ఆక‌ట్టుకుంది. ఈ శుక్ర‌వారం వ‌ర‌కూ వెంకీమామ‌కు వేరొక పోటీనే లేదు. నిర్మాత సురేష్ బాబు సొంత రిలీజ్ కాబ‌ట్టి థియేట‌ర్ల విష‌యంలో ఇబ్బందులేమీ లేవు. వెంకీమామ కు ఇప్ప‌టివ‌ర‌కూ స‌రైన పోటీ లేక‌పోవ‌డం మామ వ‌సూళ్ల‌కు క‌లిసొచ్చింది. అయితే ఈనెల 20న రూల‌ర్- ప్ర‌తిరోజూ పండ‌గే-ద‌బాంగ్ 3 చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ మూడు సినిమాల ప్ర‌భావం వెంకీమామ‌పై ప‌డ‌నుంది. టాక్ ని బ‌ట్టి ఏదైనా ఆధార‌ప‌డి ఉంటుంది.

రూల‌ర్ భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అవుతోంది. బాల‌య్య‌కు స‌క్సెస్ అనివార్య‌మైన త‌రుణ‌మిది. అటు చిత్ర‌ల‌హ‌రితో ఊర‌ట ల‌భించిన సాయితేజ్ ప్ర‌తి రోజూ పండ‌గే అంటూ థియేటర్లోకి వ‌స్తున్నాడు. ఈ రెండు బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ తెచ్చుకుంటే వెంకీమామ‌ పై ఆ మేర‌కు ప్ర‌భావం ప‌డే అవ‌కాశం ఉంది. ద‌బంగ్ 3 వ‌ల్ల‌ మ‌ల్టీప్లెక్సుల్లో పోటీ త‌ప్ప‌దు. ఈ పోటీన‌డుమ మామ ఫుల్ ర‌న్ ఛేజ్ ఎలా ఉంటుందో చూడాలి.

అదంతా స‌రే కానీ.. వెంకీమామ 2020 ప్లాన్స్ ఎలా ఉన్నాయి? అన్న‌ది చూస్తే... వెంకీ మాత్రం కెరీర్ ప‌రంగా ఫుల్ బిజీగానే ఉన్నారు. ప్ర‌స్తుతానికి వెంకీ చేతిలో మూడు ప్రాజెక్టులున్నాయి. ముందుగా శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో అసుర‌న్ రీమేక్ సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఇప్ప‌టికే ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు తుదిద‌శ‌కు చేరుకున్నాయి. అటు త్రినాథ రావు న‌క్కిన‌... పెళ్లి చూపులు ఫేం త‌రుణ్ భాస్క‌ర్ తోనూ క‌మిమెంట్లు ఉన్నాయి. వీటన్నిటినీ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించ‌నుంది. ఇంకా త్రివిక్ర‌మ్ -వెంక‌టేష్ కాంబినేష‌న్ లో ఓ సినిమా తెర‌కెక్కాల్సి ఉంది. అయితే ప్ర‌స్తుతం ఆ ఇద్ద‌రి బిజీ షెడ్యూల్ కార‌ణంగా ఇప్ప‌ట్లో ఆ ప్రాజెక్ట్ ప‌ట్టా లెక్కే అవ‌కాశం లేదు. కొత్త ఏడాదిలోకి అడుగు పెట్ట‌డానికి ఇంకా కొన్ని రోజులే ఉంది. ఈ నేప‌థ్యంలో 2020 ఏడాది ఆరంభంలో అసుర‌న్ రీమేక్ ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం ఉంది.