Begin typing your search above and press return to search.

వెంకీ బ‌ర్త్ డే.. 653 కేక్ లు సిద్ధం

By:  Tupaki Desk   |   12 Dec 2019 2:18 PM GMT
వెంకీ బ‌ర్త్ డే.. 653 కేక్ లు సిద్ధం
X
వ‌రుస‌గా వెట‌ర‌న్ హీరోలంతా ష‌ష్ఠిపూర్తి ఉత్స‌వాల‌కు రెడీ అయిపోతున్నారు. మొన్న‌నే కింగ్ నాగార్జున షష్ఠిపూర్తి అయ్యింది. 2020 డిసెంబ‌ర్ 12 నాటికి అంటే.. ఇంకో ఏడాదిలో విక్ట‌రీ వెంక‌టేష్ షష్ఠి పూర్తికి రెడీ అవుతున్నారు. ఆర్జీవీలో వ‌య‌సు గురించి బెంగ పెట్టుకునేంత టైమ్ వీళ్లంద‌రికీ లేదు. వ‌య‌సుతో ప‌నే లేకుండా కెరీర్ ప‌రంగా జోరు చూపిస్తున్నారు.

డిసెంబ‌ర్ 13న వెంకీ త‌న 59వ పుట్టిన‌రోజు జ‌రుపుకునేందుకు రెడీ అవుతున్నాడు. అదే రోజు అల్లుడు చైత‌న్య‌తో క‌లిసి వెంకీ న‌టించిన వెంకీమామ రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఇక వెంకీ మామ ఫ్యాన్స్ ఇప్ప‌టికే 653 కేక్ లు రెడీ చేసి వేడుక‌ల కోసం సిద్ధంగా ఉన్నార‌ట‌. మొత్తం 653 సింగిల్ స్క్రీన్ల‌కు వెళ్లి అక్క‌డ అభిమానుల్ని క‌లుసుకుని మ‌రీ అన్ని కేక్ లు క‌ట్ చేస్తార‌ట వెంకీ డైహార్డ్ ఫ్యాన్స్.

నిజంగానే ఇది రేర్ ఫీట్ అనే చెప్పాలి. మ‌రోవైపు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ త‌న బ‌ర్త్ డే (డిసెంబ‌ర్ 12న‌) సంద‌ర్భంగా అభిమానుల్ని ఎలాంటి హంగులు ఆర్భాటం లేకుండా బ‌ర్త్ డే వేడుక‌లు జ‌ర‌పాల‌ని కోరిన సంగ‌తి తెలిసిందే. అయితే వెంకీ కూడా ఇలాంటివి మెచ్చ‌రు. ఈసారి వెంకీమామ చిత్రం రిలీజ‌వుతోంది కాబ‌ట్టి ప్ర‌మోష‌న్ కోస‌మే ఈ హ‌డావుడి అన్న‌మాట‌. ఎట్టి ప‌రిస్థితిలో బ్లాక్ బ‌స్ట‌ర్ ని అల్లుడికి గిఫ్ట్ గా ఇవ్వాల‌న్నది వెంకీ మామ త‌ప‌న‌.