వెంకీ ఆధ్యాత్మిక ట్రిప్ విశేషాలు

Thu Oct 19 2017 15:02:39 GMT+0530 (IST)

Venkatesh Europe Trip

కామెడీ - ఫ్యామిలీ - యాక్షన్ అలాగే హిస్టారికల్ వంటి సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో విక్టరీ వెంకటేష్. అయితే గత కొంత కాలంగా ఈ విక్టరీ హీరోకి సరైన విజయం దక్కడం లేదు. రీసెంట్ గా మేనల్లుడి పెళ్లిలో ఎంతో సందడి చేసిన వెంకటేష్ ఒక పదిరోజుల పాటు విహార యాత్రలకు వెళ్లాలని ప్లాన్స్ వేసుకున్నాడట.ఒక పది రోజుల పాటు తన స్నేహితులతో యూరోప్ ట్రిప్ కి వెళుతున్నాడట. ఇదేదో సరదా ట్రిప్ కాదు.. ఒక ఆధ్యాత్మిక ట్రిప్ అని తెలుస్తోంది. వెంకీకి విహార యాత్రలంటే చాలా ఇష్టం. అంతే కాకుండా ఆయన ఆధ్యాత్మిక పర్యటనలు కూడా చాలా చేస్తారు. ఆధ్యాత్మిక గురువు రమణ మహర్షి ని అయితే చాలా ఫాలో అవుతారు. ఆ తరహాలో ఆలోచించే స్నేహితులు వెంకటేష్ కి ఎక్కువగా ఉన్నారు. ఎప్పుడన్నా టెన్షన్ గా ఫీల్ అయినపుడు వెంకటేష్ ఆధ్యాత్మిక పర్యటనలు బాగా చేస్తారట.

ఇక వెంకటేష్ సినిమాల విషయానికి వస్తే నెక్ట్ తేజ దర్శకత్వంలో సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు. సురేష్ ప్రొడక్షన్ - ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు కలిసి ఆ సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో కూడా ఒక సినిమాను చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి అలాగే విజయ దేవరకొండ తో కలిసి మరో మల్టి స్టారర్ కి వెంకీ శ్రీకారం చుడుతున్నట్లు సమాచారం.