Begin typing your search above and press return to search.

పాత దర్శకుడితో నాగ్ మంతనాలు?

By:  Tupaki Desk   |   7 Feb 2023 8:00 AM GMT
పాత దర్శకుడితో నాగ్ మంతనాలు?
X
సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున ప్రస్తుతం తన కథలు ఎంపిక విధానం పూర్తిగా మార్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. రెగ్యులర్ కమర్షియల్ కథలు కాకుండా కొత్తదనం ఉన్న కథలు వైపు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా డిఫరెంట్ జోనర్ ని ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా గత ఏడాది ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ది గోస్ట్ అనే మూవీని నాగార్జున చేసిన సంగతి అందరికీ తెలిసిందే. థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు.

ప్రస్తుతం రచయితగా గుర్తింపు తెచ్చుకున్న ప్రసన్నకుమార్ బెజవాడ దర్శకత్వంలో నాగార్జున సినిమా చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం కొత్త కథల కోసం నాగార్జున అన్వేషిస్తున్నట్లుగా టాలీవుడ్ లో విడిపిస్తున్న మాట. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒకప్పటి దర్శకుడు వీరుపోట్ల మరోసారి నాగార్జున కలిసి కథ చెప్పడం జరిగిందని ఫిలింనగర్ సర్కిల్లో వినిపిస్తుంది. అయితే ఈ కథ నాగార్జునకి ఆశించిన స్థాయిలో కనెక్ట్ కాలేదని మాట వినిపిస్తుంది.

మరో బెటర్ వెర్షన్ సిద్ధం చేయమని అతనికి సూచించినట్లుగా టాక్ వినిపిస్తుంది. నాగార్జున గతంలో వీరుపోట్ల దర్శకత్వంలో రగడ అనే సినిమాని చేశారు. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా పర్వాలేదని టాక్ చేసుకున్న కూడా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. అయితే మరోసారి వీరుపోట్ల నాగార్జునని మెప్పించే ప్రయత్నం చేసినట్లుగా టాక్ వినిపిస్తుంది.

ఇదిలా ఉంటే ప్రసన్నకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాని త్వరలో నాగార్జున సెట్స్ పైకి తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. ఈ సినిమా కథని అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా ప్రసన్నకుమార్ సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. ఈ సినిమాలో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాగూర్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉందని సమాచారం. అలాగే అల్లరి నరేష్ కూడా మరో కీలక పాత్రలో నటించబోతున్నట్లుగా తెలుస్తుంది. త్వరలో ఈ సినిమా పూజా కార్యక్రమంలో ప్రారంభం ఉన్నట్లుగా టాక్ వినిపిస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.