వీరసింహారెడ్డి బాక్సాఫీస్.. మొత్తానికి పెట్టుబడి వచ్చేసింది!

Tue Jan 24 2023 14:52:04 GMT+0530 (India Standard Time)

Veera Simha Reddy Film BoxOffice Collections

నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు ఊహించిన విధంగా మంచి కలెక్షన్స్ అందుకుంది. ఈ సినిమాకు పోటీగా సంక్రాంతిలో వాల్తేరు వీరయ్య కూడా నిలిచింది. అయితే మొదటి రోజు గట్టిగానే కలెక్షన్స్ అందుకున్న బాలయ్య ఆ తర్వాత చిరంజీవి సినిమా దెబ్బకు మళ్ళీ ఒక్కసారిగా వెనక్కి తగ్గిపోయాడు.మొదటి రోజు ఈ సినిమా 25 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ అందుకుంటే రెండవ రోజుకే దారుణంగా 5.25 కోట్లను మాత్రమే అందుకుంది. ఇక తర్వాత వారం రోజులపాటు అదే తరహాలో కలెక్షన్స్ వచ్చాయి. ఇక తొమ్మిదవ రోజుకి కోటి అందుకోవడానికి ఈ సినిమా చాలా కష్టాలు పడింది. ఇక రెండవ ఆదివారం 1.44 కోట్లు అందుకోగా సోమవారం రోజు అంటే 12వ రోజు కేవలం 16 లక్షల షేర్ కలెక్షన్స్ అందుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఇక మొత్తంగా ఈ సినిమా 12 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 63.5 కోట్ల షేర్ కలెక్షన్స్ 102.87 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇక కర్ణాటక అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో చూసుకుంటే 4.7 కోట్ల షేర్ కలెక్షన్స్ రాగా ఓవర్సీస్ లో 5.71 షేర్ కలెక్షన్స్ వచ్చాయి.

ప్రపంచవ్యాప్తంగా వీరసింహారెడ్డి సినిమాకు 12 రోజుల్లో 74 కోట్ల షేర్ 124 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 73 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా 74 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది.

ఇక మొత్తానికి సినిమా 74 కోట్లు అందుకొని నష్టాలు రాకుండా చేసింది. ఇక మిగతా రోజుల్లో ఎంతో కొంత వస్తే అది ప్రాఫిట్స్ లోకి వెళ్ళిపోతుంది. ఒక విధంగా బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా మొదటిరోజు కలెక్షన్స్ అందుకున్న విధానాన్ని బట్టి ఆ తర్వాత కూడా అదే తరహాలో కొనసాగి ఉంటే బాగుండేది. కానీ సినిమాకు నెగిటివ్ టాక్ ఎక్కువగా రావడంతో కలెక్షన్స్ ఒక్కసారిగా తగ్గిపోయాయి. దీంతో ఈ సంక్రాంతికి బాలయ్య వర్సెస్ చిరు ఫైట్ లో మరోసారి మెగాస్టార్ పై చేయి సాధించారు. నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.