Begin typing your search above and press return to search.

16 రోజుల్లో వీరసింహారెడ్డి కలెక్షన్స్ ఎంతంటే?

By:  Tupaki Desk   |   28 Jan 2023 1:06 PM GMT
16 రోజుల్లో వీరసింహారెడ్డి కలెక్షన్స్ ఎంతంటే?
X
బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం వీరసింహారెడ్డి రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఫ్యాక్షన్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా మాస్ ఆడియన్స్, ముఖ్యంగా బాలకృష్ణ నుంచి యాక్షన్ సీక్వెన్స్ ఇష్టపడే ప్రేక్షకులకి భాగా నచ్చింది.

అలాగే మూవీలో డైలాగ్స్ కూడా ఒక వర్గం ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యాయి. దీంతో మూవీకి ఎవరేజ్ టాక్ వచ్చిన కూడా రిలీజ్ అయిన మూడో నుంచి కలెక్షన్స్ పుంజుకున్నాయి. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వచ్చిన సినిమా కావడంతో బిజినెస్ కూడా ఈ మూవీకి భాగానే జరిగింది.

73 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. 74 కోట్ల బ్రేక్ ఈవెన్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చిన వీరసింహారెడ్డి మొదటి రోజు ఏకంగా 25.35 కోట్లు కలెక్ట్ చేసింది. వాల్తేర్ వీరయ్య మొదటి రోజు కలెక్షన్స్ కంటే ఈ సినిమాకే ఎక్కువ ఓపెనింగ్స్ వచ్చాయి.

అయితే రెండో రోజు అనూహ్యంగా కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి కేవలం 5.25 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. తరువాత మళ్ళీ కొద్దిగా పుంజుకొని ఆరు రోజులు నిలకడగా కలెక్షన్స్ కొనసాగాయి.

16వ రోజు కేవలం 11 లక్షలు మాత్రమే వీరసింహారెడ్డి కలెక్ట్ చేసింది. దీంతో సినిమాని థియేటర్స్ నుంచి తీసేసే సమయం వచ్చిందని చెప్పాలి. ఈ 16 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో 105.70 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అందులో 65.27 షేర్ గా ఉంది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4.78 కోట్లు గ్రాస్ వచ్చింది ఓవర్సీస్ లో 5.74 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. మొత్తంగా 125.52 కోట్ల గ్రాస్ ని వీరసింహారెడ్డి ప్రపంచ వ్యాప్తంగా కలెక్ట్ చేసింది.

షేర్ రూపంలో చూసుకుంటే 75.79 కోట్లు ఉంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ 74 కోట్లు ఉండటంతో మొత్తం కలెక్షన్స్ పరంగా చూసుకుంటే 1.79 కోట్ల ప్రాఫిట్ వచ్చిందని చెప్పాలి. ఈ లెక్కన చూసుకుంటే వాల్తేర్ వీరయ్య కంటే మైత్రీ మూవీస్ వారికి వీరసింహారెడ్డితో భారీ లాభాలు అయితే రాలేదు. అలాగే నష్టాలు కూడా లేకుండా సేవ్ జోన్ లో హిట్ టాక్ తో బయటపడినట్లు అయ్యింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.