Begin typing your search above and press return to search.

వీరసింహారెడ్డి 17 డేస్ కలెక్షన్స్.. వీకెండ్ కూడా డమాల్!

By:  Tupaki Desk   |   29 Jan 2023 2:03 PM GMT
వీరసింహారెడ్డి 17 డేస్ కలెక్షన్స్.. వీకెండ్ కూడా డమాల్!
X
బాలయ్య బాబు కెరియర్లో అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ వీరసింహారెడ్డి. బాలకృష్ణకి బాగా అచ్చొచ్చిన రాయలసీమ నేపథ్యంలో ఈ సినిమా కథాంశాన్ని దర్శకుడు గోపీచంద్ సిద్ధం చేసి ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. సంక్రాంతి పొంగల్ కానుకగా థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా బాలయ్య కెరీర్ లో మరో మాస్ మసాలా మూవీగా ప్రశంసలు అందుకుంది. క్రిటిక్స్ నుంచి యావరేజ్ స్టాక్ వచ్చిన కూడా బాలకృష్ణ నుంచి పవర్ ఫుల్ డైలాగ్స్, అంతే పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ఇష్టపడే వారికి వీర సింహారెడ్డి బాగ నచ్చింది.

అలాగే సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ కూడా చాలామందికి కనెక్ట్ అయింది. స్టోరీ రొటీన్ గా అనిపించినా బాలకృష్ణ మాస్ ఎలివేషన్స్ పర్ఫెక్ట్ గా కుదరడంతో ముఖ్యంగా నందమూరి అభిమానులను ఈ సినిమా అలరించింది. అలాగే రాయలసీమ ఫ్యాక్షన్ కథలు ఇష్టపడే వారికి కూడా వీర సింహారెడ్డి కొంతవరకు నచ్చిందని చెప్పాలి. అయితే మొదటి రోజు 25.35 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన వీర సింహారెడ్డి రెండో రోజుకి అనూహ్యంగా డ్రాప్ అయిపోయింది. కేవలం 5.25 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేయగలిగింది.

తర్వాత మరల మొదటివారం పూర్తయ్యేంతవరకు డీసెంట్ కలెక్షన్స్ తో కొనసాగింది. ముఖ్యంగా మాస్ యాక్షన్ సినిమాలో ఇష్టపడేవారు వీర సింహారెడ్డి సినిమా చూడడానికి ఆసక్తి చూపించారు. ఇదిలా ఉంటే లాంగ్ రన్ లో ఇప్పటివరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 127.85 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. నైజా మీడియాలో 16.93 కోట్ల షేర్ రాబట్టింది. ఓవర్సీస్ లో 5.75 కోట్లు షేర్ ని కలెక్ట్ చేయగలిగింది. దీంతో 17 రోజుల్లో వీర సింహారెడ్డి మూవీ 75.95 కోట్ల షేర్ థియేటర్స్ నుంచి వచ్చింది. 74 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా ఓవరాల్ గా ఇప్పటివరకు 1.95 కోట్ల ప్రాఫిట్ మాత్రమే నిర్మాతలకు తెచ్చిపెట్టింది.

దీంతో ఈ మూవీ మినిమమ్ హిట్ బొమ్మగా మాత్రమే నిలిచింది. అయితే నిర్మాతలకి శాటిలైట్, డిజిటల్ రైట్స్ ద్వారా భారీగానే లాభాలు తెచ్చి పెట్టిందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న మాట. సంక్రాంతి రేసులో ఈ మూవీ రిలీజ్ కావడం వల్ల మైత్రి మూవీ మేకర్స్ వారికి వీర సింహారెడ్డి కాస్త ప్రాఫిట్ తీసుకొచ్చిన ప్రాజెక్టుగా అయిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఫెస్టివల్ సీజన్ కాకుండా ఇంకో టైం లో రిలీజ్ అయి ఉంటే మాత్రం నిర్మాతలు భారీగా నష్టపోయే వారినే మాట వినిపిస్తుంది.